Wednesday, March 18, 2026

సంగారెడ్డిలో ఘనంగా బేటీ జన్మోత్సవ కార్యక్రమం

 

సంగారెడ్డి ప్రతినిధి, మార్చి 17 (SNM న్యూస్): సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా–శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో, మహిళా సాధికారత కేంద్రం సహకారంతో బేటీ జన్మోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఆసుపత్రిలో జన్మించిన ఆడ శిశువులను గౌరవిస్తూ బేటీ జన్మోత్సవ కిట్లు, ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా మహిళా సంక్షేమాధికారి, జిల్లా వైద్య ఆరోగ్యాధికారి మాట్లాడుతూ ఆడపిల్లలు, మగపిల్లలను సమానంగా చూడాల్సిన అవసరాన్ని వివరించారు. సమాజంలో ఆడపిల్లల పట్ల గౌరవ భావం పెంపొందించాల్సిన అవసరాన్ని తెలియజేశారు. బాలికల విద్య, ఆరోగ్యం, భద్రత అంశాలలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని సూచించారు. అలాగే, పుట్టిన శిశువులకు తల్లి పాల ప్రాధాన్యతను వివరిస్తూ మొదటి ఆరు నెలల పాటు పూర్తిగా తల్లి పాలనే ఇవ్వాలని అవగాహన కల్పించారు. అవసరమైన సందర్భాలలో మహిళా సాధికారత కేంద్రం సేవలను వినియోగించుకోవాలని సూచించారు. బాలికల హక్కుల పరిరక్షణ, పోషణ, విద్యపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటేనే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అధికారి డాక్టర్ మురళీకృష్ణ, డాక్టర్ నాగనిర్మల, మహిళా సాధికారత కేంద్ర సమన్వయకర్త పల్లవి, ఆసుపత్రి సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతంగా సాగింది. ఇదే విధంగా పటాన్‌చెరు ప్రాంతీయ ఆసుపత్రిలో కూడా బేటీ జన్మోత్సవ కిట్లను పంపిణీ చేశారు.

No comments:

Post a Comment

నూతన డీఈఓ రోహిణికి శుభాకాంక్షలు

  సంగారెడ్డి, జూన్ 10: సంగారెడ్డి జిల్లా నూతన జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ)గా బాధ్యతలు చేపట్టిన శ్రీమతి రోహిణి గారిని తెలంగాణ ప్రదేశ్ రాష్...