Friday, January 30, 2026

కీలక ఖనిజాల పరిశోధనకు మహీంద్రా యూనివర్సిటీ–ఐఐటీ హైదరాబాద్ భాగస్వామ్యం

 పరిశోధన, నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

సంగారెడ్డి ప్రతినిధి, జనవరి 30 (SNM NEWS):

కీలక ఖనిజాల రంగంలో పరిశోధన, విద్య, నైపుణ్యాభివృద్ధిని బలోపేతం చేయడమే లక్ష్యంగా మహీంద్రా యూనివర్సిటీ మరియు భారతీయ సాంకేతిక సంస్థ హైదరాబాద్ (ఐఐటీహెచ్) వ్యూహాత్మక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ భాగస్వామ్యం ద్వారా కీలక ఖనిజాలు, స్థిరమైన గనుల తవ్వకం, ఆధునిక పారిశ్రామిక ప్రక్రియలపై సంయుక్త పరిశోధనలు నిర్వహించనున్నారు. ఐరన్ ఓర్ బెనిఫిషియేషన్, బొగ్గు-ఖనిజ ప్రాసెసింగ్, ఉక్కు తయారీ, మైనింగ్ వ్యర్థాల వినియోగం, కీలక-అరుదైన భూమి ఖనిజాల తవ్వకం, ప్రక్రియల మోడలింగ్, సిమ్యులేషన్ వంటి రంగాలు ఇందులో భాగం. అదేవిధంగా మైనింగ్‌లో ఏఐ, డేటా అనలిటిక్స్, మైనింగ్ 4.0, డ్రోన్లు, స్వయంచాలక వాహనాలు, స్టార్టప్‌లు, ఇన్క్యూబేషన్ మద్దతుపై కూడా దృష్టి సారించనున్నారు. ఈ ఒప్పందం ప్రకారం ఐఐటీ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కీలక ఖనిజాల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఒప్పందంకు మహీంద్రా యూనివర్సిటీ స్పోక్ ఇన్‌స్టిట్యూట్గా వ్యవహరిస్తుంది. సంయుక్త పరిశోధన ప్రాజెక్టులు, అధ్యాపకులు-విద్యార్థుల మార్పిడి, ప్రయోగశాలలు, మౌలిక సదుపాయాల సంయుక్త వినియోగం ద్వారా ఈ భాగస్వామ్యం అమలులోకి రానుంది. 

జాతీయ కీలక ఖనిజాల మిషన్  కింద కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ ఐఐటీ హైదరాబాద్‌ను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా గుర్తించడం ఈ భాగస్వామ్యానికి మరింత బలం చేకూర్చిందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా మహీంద్రా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డా. యాజులు మెదురి, ఈ సహకారం జాతీయ కీలక ఖనిజాల మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా పరిశోధన ఆధారిత స్వదేశీ సాంకేతిక పరిష్కారాలను ప్రోత్సహిస్తుందని అన్నారు. ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బి.ఎస్. మూర్తి, కీలక ఖనిజాలు, వనరుల సమర్థ వినియోగంలో స్వావలంబన దిశగా ఈ భాగస్వామ్యం కీలకంగా నిలుస్తుందని తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు, సర్టిఫికేట్ కోర్సులు, మాస్టర్ డిగ్రీ ప్రణాళికలు, ఉద్యోగులకు తక్కువ కాల శిక్షణలు, అలాగే స్టార్టప్‌లు, ఎంఎస్‌ఎంఈలకు ఇన్క్యూబేషన్, సీడ్ సపోర్ట్ అందించనున్నారు.

12 వ వార్డు బీజేపీ పార్టీ అభ్యర్థి గా నామినేషన్ దాఖలు చేసిన సాహితీ రాము


సంగారెడ్డి ప్రతినిధి, జనవరి 30 (SNM NEWS):సంగారెడ్డి లోని 12 వ వార్డు బీజేపీ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సాహితీ రాము తమ వార్డు ప్రజలు వెంటరాగా ఇంటి నుండి మున్సిపాలిటీ వరకు ర్యాలీ గా వెళ్లి నామినేషన్ వేశారు.వార్డు ప్రజల ఆశీర్వాదంతో కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాలు తనను గెలిపిస్తాయని అన్నారు. వార్డులో గత పాలకులు చేసిన అభివృద్ధి శూన్యమని రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయని తాను గెలిస్తే కాలనీలోని రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ కచ్చితంగా పూర్తి చేస్తానని అన్నారు. ఎంపీ, ఎమ్మెల్సీ నిధులు ఉపయోగించి కాలనీ అభివృద్ధికి బాటలు వేస్తామని ఆయన అన్నారు. రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన నాకు సేవ చేయడమే తెలుసని తనను గెలిపిస్తే వార్డు సర్వతో ముఖాభివృద్ధికి సర్వదా కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

రాజంపేట 15వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సుష్మిత ప్రశాంత్ కుమార్ నామినేషన్

 భారీ జనసంద్రం, కార్యకర్తలు–కాలనీవాసుల హాజరు

సంగారెడ్డి ప్రతినిధి, జనవరి 29 (SNM NEWS) :

రాజంపేట మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ధర్నారం సుష్మిత ప్రశాంత్ కుమార్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, కాలనీవాసులు, ప్రజలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్ వేయడానికి వెళ్లారు. వార్డు పరిధిలో నిర్వహించిన ఈ ర్యాలీకి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. కాంగ్రెస్ పార్టీ జెండాలు, నినాదాలతో రాజంపేట ప్రాంతం జనసంద్రంగా మారింది. అభ్యర్థికి స్థానిక ప్రజల సంపూర్ణ మద్దతు ఉందని ఈ ర్యాలీ స్పష్టం చేసింది. ఈ కార్యక్రమంలో రాజంపేట కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, ముఖ్య నాయకులు కంబాలపల్లి శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ కాశ్మీర్ రాజు, ఎంఆర్ఎఫ్ శ్రీనివాస్, పట్లూరి శ్రీనివాస్, తోట జగన్మోహన్, వడ్ల వెంకటేశం, గన్నారం చంద్రయ్య, టేకుల ఆనంద్, గన్నారం మల్లేష్, టేకుల ఆగమయ్య, బండ గోపాల్, పూజారి ప్రభాకర్, అడివయ్య, ఎంఆర్ఎఫ్ రాంచందర్, టేకుల భూపాల్, నాయకులు మజీద్, సీనియర్ నాయకులు రఫీ, షఫీ, బిక్షపతి గౌడ్, ఆంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే మైనార్టీ మహిళలు, పార్టీ కార్యకర్తలు, రాజంపేట ప్రజలందరూ పెద్ద సంఖ్యలో హాజరై నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ప్రజల కోసం నిరంతరం పనిచేస్తామని ఈ సందర్భంగా అభ్యర్థి సుష్మిత ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు.

30వ వార్డు నుంచి గొల్ల ఆంజనేయులు విజయలక్ష్మి నామినేషన్

భారీ ర్యాలీతో మున్సిపల్ కార్యాలయానికి చేరిక

సంగారెడ్డి ప్రతినిధి, జనవరి 29 (SNM NEWS) :

సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 30వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థిగా గొల్ల ఆంజనేయులు విజయలక్ష్మి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వార్డు పరిధిలో భారీ ర్యాలీ నిర్వహించి, కార్యకర్తలు, మద్దతుదారులతో కలిసి మున్సిపల్ కార్యాలయానికి చేరుకొని నామినేషన్ పత్రాలను సమర్పించారు. ర్యాలీ సందర్భంగా నినాదాలతో వార్డు ప్రాంతమంతా ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. అభ్యర్థికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతామని గొల్ల ఆంజనేయులు విజయలక్ష్మి ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జనార్దన్, పండు అన్న, అరుణ్ చారీ, అఖిల్, తూర్పు ఆంజనేయులు తదితరులు పాల్గొని అభ్యర్థికి సంఘీభావం తెలిపారు. అలాగే పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు హాజరై నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Monday, January 26, 2026

యువ స్విమ్మర్లకు ఘన సత్కారం, అబ్దుర్ రెహమాన్, అబ్దుల్ నజీర్లకు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అవార్డులు


సంగారెడ్డి, జనవరి 26 (SNM న్యూస్):స్విమ్మింగ్ పోటీల్లో విశేష ప్రతిభ కనబరిచిన యువ స్విమ్మర్లు ముహమ్మద్ అబ్దుర్ రెహమాన్ సిద్ధిఖ్, అబ్దుల్ నజీర్లు సంగారెడ్డి పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ పి.ప్రావిణ్య, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ విజేతలకు అవార్డులు అందజేశారు. జిల్లా కలెక్టర్ సహకారంతో స్విమ్మింగ్ పూల్ అభివృద్ధి జరగడంతో పాటు, జిల్లా అధికారి డివైఎస్ఓ అఖిలేష్ రెడ్డి ప్రోత్సాహం వల్లే ఇలాంటి విజయాలు సాధ్యమవుతున్నాయని స్విమ్మింగ్ ఇన్చార్జ్ శేషు కుమార్ తెలిపారు. ప్రతిభ కనబరిచిన స్విమ్మర్స్ కు సంగారెడ్డి జిల్లా స్కూల్ గేమ్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాస్ అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా అని విధాల సహకరిస్తున్న జిల్లా యంత్రాంగానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. డి వై ఎస్ ఓ అఖిలేష్ రెడ్డి విజేతలకు అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డి ఎస్ ఏ సిబ్బంది దీపిక, స్నేహలత, పవన్ కళ్యాణ్, స్విమ్మింగ్ పూల్ సిబ్బంది పవన్, కృష్ణ, కుమార్ పాల్గొని అభినందనలు తెలియజేశారు.

డీఆర్డీఏ–ఐకేపీ ఏపీఎం సోమా శివలక్ష్మికి ప్రశంస, గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రశంసా పత్రం ప్రదానం

 

సంగారెడ్డి, జనవరి 26 (SNM న్యూస్): సంగారెడ్డి జిల్లా కంది మండలంలో డీఆర్డీఏ–ఐకేపీ అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న సోమా శివలక్ష్మిని జిల్లా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఘనంగా సత్కరించారు. మండలంలోని గ్రామాలకు అందించిన విశేష సేవలకు గుర్తింపుగా జిల్లా కలెక్టర్, టీజీఐసీ చైర్‌పర్సన్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి చేతుల మీదుగా ఆమెకు ప్రశంసా పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల అమలులో సోమా శివలక్ష్మి సమర్థవంతంగా పనిచేస్తూ, స్వయం సహాయక సంఘాల బలోపేతం, మహిళా సాధికారత, ఉపాధి అవకాశాల కల్పనలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు చేరవేయడంలో ఆమె సేవలు ఆదర్శప్రాయమని కొనియాడారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా వివిధ శాఖల ఉత్తమ ఉద్యోగులను సన్మానించగా, సోమా శివలక్ష్మికి లభించిన ఈ గౌరవం డీఆర్డీఏ–ఐకేపీ సిబ్బందికి ప్రోత్సాహకరంగా నిలిచిందని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.

Sunday, January 25, 2026

పాఠశాల అభివృద్ధికి సర్పంచ్ కృషి అభినందనీయం

రాయికోడ్, జనవరి 23(SNM న్యూస్): తమ పాఠశాల అభివృద్ధి కోసం సహాకారం చేస్తున్న మామిడిపల్లి గ్రామ సర్పంచ్ కృషి అభినందనీయమని రాయికోడ్ ఎంపిడిఓ ఎం.ఎం షరీఫ్, ఎంఈఓ మానయ్య, కర్చల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ నర్సింలు అన్నారు. రాయికోడ్ మండలం మామిడిపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్థానిక సర్పంచ్ షబానా నాజ్ మహబూబ్ పటేల్ స్వంత ఖర్చులతో స్పోర్ట్స్ డ్రెస్ లు, ఐడెంటిటీ కార్డులు పంపిణి చేశారు. అంతకు ముందు మామిడిపల్లి గ్రామానికి నూతనంగా మంజూరైనా ప్రీ ప్రైమరి క్లాస్ రూమ్ ను ఎంపిడిఓ, ఎంఈఓ, కంప్లెక్స్ హెడ్ మాస్టర్ లు ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ డిజిటల్ క్లాస్ రూమ్ ఏర్పాటు తో ప్రయివేట్ పాఠశాల కు దీటుగా బోధన, మంచి సౌకర్యాlu ఉంటాయన్నారు. పాఠశాలల బలోపేతం గ్రామభివృద్ధికి కీలకమని దాతల సాయం ఆ దిశగా మంచి ప్రయత్నమని అభినందించారు. అనంతరం అక్షయ పాత్ర భోజనాన్ని పిల్లలకు వడ్డించి వారు రుచి చూశారు. కార్యక్రమం లో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనసూయ దేవి, పంచాయతీ కార్యదర్శి బస్వారాజు, వార్డ్ సభ్యులు,  మాజీ పీ.ఎ.సి.ఎస్ చైర్మన్ నజీర్, దాత బగిలి సమీర్ ఫీల్డ్ అసిస్టెంట్ అల్తాఫ్, వీఓఏ మల్లేశం, అంగన్వాడీ సిబ్బంది, నాయకులు భీమ్ రావు, మాణిక్యయ్య, అంజి, హాసన్ పటేల్, శంకర్, గ్రామ పెద్దలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ప్రతి ఫోటో–వీడియో గ్రాఫర్‌కు కుటుంబ భరోసా తప్పనిసరి

 


జిల్లా కార్యవర్గ సమావేశంలో అధ్యక్షులు సుప్పాల శ్రీనివాస్

సంగారెడ్డి, జనవరి 25:—ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఫోటో, వీడియో గ్రాఫర్ తప్పనిసరిగా కుటుంబ భరోసా స్కీమ్లో చేరాలని సంగారెడ్డి జిల్లా ఫోటో & వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం అధ్యక్షులు సుప్పాల శ్రీనివాస్ అన్నారు.శనివారం సంగారెడ్డి పట్టణంలోని పద్మశాలి భవనంలో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముందు సభ్యులందరి నుంచి సూచనలు, అభిప్రాయాలను సేకరించారు. అనంతరం అధ్యక్షులు మాట్లాడుతూ, సంఘ అభివృద్ధి, సభ్యుల సంక్షేమమే లక్ష్యంగా కీలక అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు.

సమావేశంలో చర్చించిన ముఖ్య అంశాలు ఇవి:

కుటుంబ భరోసా స్కీమ్, TGPVWA యాప్ కార్యక్రమం

ఆధునిక ఏఐ సాంకేతికత – ప్రాముఖ్యత, వినియోగాలు

ఎల్‌ఈడీ వాల్, డ్రోన్, సినిమాటిక్ ఫోటోగ్రఫీ

సంఘ సభ్యత్వం – ప్రాధాన్యత

జిల్లా నుంచి గ్రామస్థాయి వరకు ఎదురవుతున్న సమస్యలు, పరిష్కార మార్గాలు

ఫోటోగ్రాఫర్ల వాట్సాప్ గ్రూపుల్లో చర్చలు

జిల్లా, మండల కార్యవర్గ లోపాలపై సమీక్ష

జిల్లా స్థాయిలో ఒకే ధరల జాబితా (ప్రైస్ లిస్ట్) అంశం

జిరాక్స్ కేంద్రాలు, ఇతర దుకాణాల్లో పాస్‌పోర్ట్ ఫోటోలు తీయడంపై చర్చ

స్థానిక సమస్యలు, సభ్యుల అభిప్రాయాల సేకరణ

ఫోటోగ్రాఫర్లకు వర్క్‌షాప్‌లు, అవగాహన సదస్సులు

ఈఎస్‌ఐ వంటి సంక్షేమ అంశాలు

కుటుంబ భరోసా స్కీమ్‌లో ఇంకా నమోదు చేసుకోని ఫోటో, వీడియో గ్రాఫర్లకు ఈ పథకం ప్రాముఖ్యతను తెలియజేసి సభ్యత్వం కల్పించే బాధ్యత మండల స్థాయి పీఎస్‌టీ లపై ఉందని ఆయన స్పష్టం చేశారు.జి ల్లా కార్యవర్గ సభ్యులందరూ అంకితభావంతో పనిచేసి సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సతీష్, కోశాధికారి బాలరాజ్, తదితర జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Saturday, January 24, 2026

కల్లుగీత కార్మిక సంఘం క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి దామోదర్ రాజనరసింహ

 

సంగారెడ్డి, జనవరి 23 (SNM న్యూస్): కల్లుగీత కార్మిక సంఘం సంగారెడ్డి జిల్లా కమిటీ రూపొందించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను దామోదర్ రాజనరసింహ ఆరోగ్య శాఖ మంత్రి చేతుల మీదుగా శుక్రవారం వారి నివాసంలో ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ. కల్లు గీత కార్మిక సంఘం. స్పందించిన క్యాలెండర్ గౌడ సోదరులకు గీతా కార్మికులకు పూర్తి నిచ్చే విధంగా ఉందని సంఘం నాయకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో డి.ఎస్.పి సత్తయ్య గౌడ్ ,జిల్లా అధ్యక్షులు ఆశన్న గౌడ్. జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్. కాంగ్రెస్ పార్టీ జిల్లాయువ నాయకులు నరేందర్ గౌడ్ , సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జంగన్న గౌడ్ జిల్లా నాయకులు శ్రీనివాస్ గౌడ్ యాదగౌడ్ రవీందర్ గౌడ్. కవి రచయిత ఉమ్మన్నగారి కృష్ణ గౌడ్ కుమార్ గౌడ్ . ప్రతాప్ గౌడ్.. తదితరులు పాల్గొన్నారు.

జాతీయ ఓటర్ దినోత్సవం - వసంత పంచమి ఘనంగా నిర్వహణ

 

రాయికోడ్, జనవరి 23 (SNM న్యూస్): ఎం. పి. పి. స్ రాయికోడ్ పాఠశాలలో నిర్వహించిన జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు విలువను ప్రజలకు తెలియజేయడం, యువతలో ఓటు ప్రాధాన్యతపై అవగాహన కల్పించడం లక్ష్యంగా ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటర్ దినోత్సవంను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.శ్రీనివాస్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకొని, ఎన్నికల ప్రక్రియలో బాధ్యతాయుతంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు,జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలియజేయడం అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడాయి. ప్రజలలో ఎన్నికలపై నమ్మకం పెంపొందించడమే ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. శ్రీనివాస్ తెలిపారు.

అదే విధంగా శుక్రవారం వసంత పంచమి పర్వదినం కూడా కావడంతో, జ్ఞానం, విద్య, కళలకు ప్రతీక అయిన శ్రీ సరస్వతి దేవిని భక్తిశ్రద్ధలతో పూజించారు. వసంత ఋతువు ఆరంభాన్ని సూచించే ఈ పర్వదినం విద్యార్థులలొ నూతనోత్సాహాన్ని నింపుతుంది. జాతీయ ఓటర్ దినోత్సవం మరియు వసంత పంచమి ఒకే రోజున రావడం విశేషమని, జ్ఞానం, బాధ్యతాయుత పౌరసత్వం కలిసి సమాజ అభివృద్ధికి దోహదపడతాయని పాఠశాల ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు యాదవులు, సల్మా,తులసి, శ్రావణి,శోభ, విద్యార్థులు పాల్గొన్నారు.

ఐఐటీ హైదరాబాద్ తొలిసారిగా వార్షిక పుస్తక ప్రదర్శన

 

సంగారెడ్డి, జనవరి 23 (SNM న్యూస్): ఐఐటీ హైదరాబాద్‌లోని నాలెడ్జ్ రిసోర్స్ సెంటర్ (కెఆర్‌సి) తన వార్షిక పుస్తక ప్రదర్శన 2026ను శుక్రవారం లెక్చర్ హాల్ కాంప్లెక్స్ (ఎల్‌హెచ్‌సి) కారిడార్‌లో ప్రారంభించింది, ఇది ఈ రకమైన పుస్తక ప్రదర్శనలో ఇదే తొలిసారి. సీనియర్ అధ్యాపకులు మరియు నిర్వాహకుల సమక్షంలో ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బి.ఎస్. మూర్తి ఈ ప్రదర్శనను లాంఛనంగా ప్రారంభించారు. 2026 జనవరి 23–24 తేదీల్లో జరగనున్న ఈ రెండు రోజుల కార్యక్రమం ప్రముఖ ప్రచురణకర్తల నుండి విస్తృత శ్రేణి విద్యా, పిల్లల మరియు సాధారణ-ఆసక్తి పుస్తకాలను ఒకే తాటిపైకి తెస్తుంది. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, పుస్తక ప్రియులు ఈ ప్రదర్శనలో చురుకుగా పాల్గొంటున్నారు, ఇది క్యాంపస్‌లో పఠనం, జ్ఞాన నిశ్చితార్థం యొక్క బలమైన సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. ప్రారంభ కార్యక్రమంలో లైబ్రరీ చైర్మన్ ప్రొఫెసర్ సాకేత్ అస్థానా ప్రసంగించారు. ప్రొఫెసర్ అశోక్ కుమార్ పాండే డీన్ (విద్యాపరమైన), ప్రొఫెసర్ ప్రేమ్ పాల్, డీన్ (పరిపాలన) వి. వెంకట్ రావు హాజరయ్యారు.ఈ కార్యక్రమాన్ని చీఫ్ లైబ్రరీ ఆఫీసర్ డాక్టర్ భోజరాజు గుంజాల్ నేతృత్వంలోని కె ఆర్ సి లైబ్రరీ బృందం సమన్వయం చేస్తోంది.నాలెడ్జ్ రిసోర్స్ సెంటర్ నిర్వహిస్తున్న ఈ ప్రారంభ ఎడిషన్ ఐ ఐ టి హైదరాబాద్‌లో కొత్త జ్ఞాన చొరవకు నాంది పలుకుతుంది. పుస్తక ప్రదర్శన ఇప్పుడు ప్రతి సంవత్సరం అనేకసార్లు నిర్వహించబడుతుందని, భవిష్యత్ ఎడిషన్‌లు సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంటాయని కె ఆర్ సి ప్రకటించింది, ఇది ఇన్‌స్టిట్యూట్ యొక్క విస్తరణ, చదవడం, నేర్చుకోవడం, మేధో మార్పిడిని ప్రోత్సహించడంలో నిబద్ధతను మరింత బలోపేతం చేస్తుంది.

ఈనెల 25న ఘనంగా పాపనాశ రథసప్తమి వ్రత మహోత్సవం

సంగారెడ్డి జనవరి 23 (SNM న్యూస్): సంగారెడ్డి మండలం ఫసల్ వాది శివారులోని శ్రీ జ్యోతిర్లి వాస్తు విద్యాపీఠంలో ఈనెల 25వ తేదీన ఉదయం 10 గంటలకు 1671 మంది మహిళలచే శ్రీ పాపనాశ రథసప్తమి వ్రతం మహోత్సవం నిర్వహిస్తున్నట్లు వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి తెలిపారు. ఆశ్రమంలో శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడారు. 2014 సంవత్సరం నుంచి మహిళల కోసం ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం వ్రతాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మహిళల్లో సంస్కారం అనబడితే కుటుంబమంతా సంతోషంగా ఉంటుందని పేర్కొన్నారు. పాపనాశ రథసప్తమి వ్రతం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో విద్యాపీఠం సభ్యులు తోపాజి అనంతకిషన్ ప్రశాంత్ సంజయ్ విఠల్ దాస్ మురళి శ్రీధర్ కృష్ణ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యాపీఠం సభ్యులు తోపాజి అనంతకిషన్ ప్రశాంత్ సంజయ్ విఠల్ దాస్ మురళి శ్రీధర్ కృష్ణ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు...

ఈనెల 25న చలో కోకాపేట్ రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజసంఘం రాష్ట్ర కమిటీ ప్రమాణ స్వీకారం

 

 సంగారెడ్డి ,  జనవరి 23,  (SNM న్యూస్): కోకాపేట్  లో జరిగే రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజసంఘం రాష్ట్ర  కమిటీ ప్రమాణ స్వీకారానికి సంగారెడ్డి జిల్లా వీరశైవ లింగాయత్ లు అందరూ తప్పకుండా హాజరు కాగలని  శుక్రవారం రాష్ట్ర వీరశైవ లింగాయత్ బలిజ సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు యన్.శివకుమార్ గారి అధ్యక్షతన విద్యుత్ ఉద్యోగుల సంఘ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ  ఆదివారం రోజు  ఉదయం ఏడున్నర గంటలకు శ్రీ సంజీవని హనుమాన్ ఆలయం సంగారెడ్డి (భూమయ్య పెట్రోల్ బంక్ ) దగ్గర బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే సంగారెడ్డి జిల్లా నుండి వందలాదిమంది సంఘ నాయకులు, సంఘ సభ్యులు తరలి వెళ్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో  రాష్ట్ర కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం, జిల్లా కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం,  క్యాలెండర్,  డైరీ ఆవిష్కరణ జరుగుతుందని అలాగే  నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్ లకు సన్మానం కలదన్నారు . కాబట్టి ఈ కార్యక్రమానికి సంగారెడ్డి జిల్లాలోని వీరశైవలింగాయత్ బంధు మిత్రులందరు హాజరు కాగలరని వారు కోరారు . ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు పట్లోళ్ల సంగమేశ్వర్  జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాలకంటి మాణయ్య  జిల్లా కోశాధికారి జె రాజేశ్వర్ స్వామి వర్కింగ్ ప్రెసిడెంట్ పి శివకుమార్ ముఖ్య సలహాదారులు పట్లోళ్ల మల్లికార్జున పాటిల్  తుమ్మలపల్లి పృథ్వీరాజ్  డిసిప్లినరీ, ప్రెస్  కమిటీ అధ్యక్షులు  యమ్.అశోక్ బాబు  యూత్ కమిటీ జిల్లా అధ్యక్షుడు మహేష్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.

Wednesday, January 21, 2026

లైఫ్ సపోర్ట్ ఎక్సలెన్స్ గా యశోద ఆసుపత్రికి గుర్తింపు

 

సంగారెడ్డి ప్రతినిధి, జనవరి 21 (SNM న్యూస్):ప్రపంచస్థాయి వైద్యం, అత్యాధునిక ట్రాన్స్‌ప్లాంట్ సేవలు, ఎయిర్ అంబులెన్స్ సౌకర్యాలతో హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ భారతదేశంలోని ఏకైక ప్లాటినం–సర్టిఫైడ్ ఈసీఎంఓ సెంటర్‌గా నిలిచిందని యశోద హాస్పిటల్స్ క్రిటికల్ కేర్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ వెంకట్ రామన్ కోలా తెలిపారు. బుధవారం సంగారెడ్డిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గ్లోబల్ ప్రమాణాలు కలిగిన ఎక్స్‌ట్రాకార్పోరియల్ లైఫ్ సపోర్ట్ ఆర్గనైజేషన్ (ఈఎల్‌ఎస్‌ఓ) ద్వారా లైఫ్ సపోర్ట్‌లో అత్యున్నత స్థాయి ప్లాటినం అవార్డును యశోద హాస్పిటల్స్ అందుకున్నందుకు గర్వంగా ఉన్నట్లు చెప్పారు. ఈ గుర్తింపుతో యశోద హాస్పిటల్స్ భారతదేశంలోనే ఏకైక ప్లాటినం–సర్టిఫైడ్ ఈసీఎంఓ కేంద్రంగా గుర్తింపు పొందిందన్నారు. ప్లాటినం–సర్టిఫైడ్ ఈసీఎంఓ సెంటర్‌గా వీవీఏ, వీవీ, ఈసీపీఆర్, అవేక్ ఈసీఎంఓతో పాటు కాంప్లెక్స్ మల్టీ–ఆర్గాన్ సపోర్ట్ సేవలను యశోద హాస్పిటల్స్ అందిస్తోందని తెలిపారు. అనుభవజ్ఞులైన ఇంటెన్సివిస్టులు, కార్డియోథొరాసిక్ సర్జన్లు, పెర్ఫ్యూషనిస్టులు, ట్రాన్స్‌ప్లాంట్ వైద్యులు, ప్రత్యేక శిక్షణ పొందిన ఐసీయూ నర్సుల బృందం ఈ సేవలకు మద్దతుగా ఉన్నట్లు పేర్కొన్నారు. అత్యాధునిక పర్యవేక్షణ, కఠినమైన ఇన్ఫెక్షన్ నియంత్రణ చర్యలు, అంతర్జాతీయ మార్గదర్శకాలకు అనుగుణమైన ప్రోటోకాల్స్‌తో 24 గంటల క్రిటికల్ కేర్ యూనిట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కాలేయం, మూత్రపిండాలు, గుండె, ఊపిరితిత్తులు, ఎముక మజ్జ మార్పిడితో సహా సమగ్ర అవయవ మార్పిడి సేవలు అందిస్తూ, ఎండ్‌స్టేజ్ గుండె, శ్వాసకోశ వైఫల్యంతో బాధపడుతున్న రోగులకు ఈసీఎంఓ ద్వారా ప్రాణరక్షక మద్దతు అందిస్తున్నట్లు డాక్టర్ వెంకట్ రామన్ కోలా వెల్లడించారు.


అభిమానానికి ప్రతిగా అండగా నిలిచిన జగ్గారెడ్డి చెప్పులు కుట్టే కార్మికుడికి రూ.50 వేల ఆర్థిక సహాయం

  సంగారెడ్డి, ఫిబ్రవరి 10 (SNM NEWS): సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. మానవతా విలువలకు ప్రతీకగా నిల...