సంగారెడ్డి , జనవరి 23, (SNM న్యూస్): కోకాపేట్ లో జరిగే రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజసంఘం రాష్ట్ర కమిటీ ప్రమాణ స్వీకారానికి సంగారెడ్డి జిల్లా వీరశైవ లింగాయత్ లు అందరూ తప్పకుండా హాజరు కాగలని శుక్రవారం రాష్ట్ర వీరశైవ లింగాయత్ బలిజ సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు యన్.శివకుమార్ గారి అధ్యక్షతన విద్యుత్ ఉద్యోగుల సంఘ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ ఆదివారం రోజు ఉదయం ఏడున్నర గంటలకు శ్రీ సంజీవని హనుమాన్ ఆలయం సంగారెడ్డి (భూమయ్య పెట్రోల్ బంక్ ) దగ్గర బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే సంగారెడ్డి జిల్లా నుండి వందలాదిమంది సంఘ నాయకులు, సంఘ సభ్యులు తరలి వెళ్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం, జిల్లా కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం, క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ జరుగుతుందని అలాగే నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్ లకు సన్మానం కలదన్నారు . కాబట్టి ఈ కార్యక్రమానికి సంగారెడ్డి జిల్లాలోని వీరశైవలింగాయత్ బంధు మిత్రులందరు హాజరు కాగలరని వారు కోరారు . ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు పట్లోళ్ల సంగమేశ్వర్ జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాలకంటి మాణయ్య జిల్లా కోశాధికారి జె రాజేశ్వర్ స్వామి వర్కింగ్ ప్రెసిడెంట్ పి శివకుమార్ ముఖ్య సలహాదారులు పట్లోళ్ల మల్లికార్జున పాటిల్ తుమ్మలపల్లి పృథ్వీరాజ్ డిసిప్లినరీ, ప్రెస్ కమిటీ అధ్యక్షులు యమ్.అశోక్ బాబు యూత్ కమిటీ జిల్లా అధ్యక్షుడు మహేష్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment