Tuesday, September 30, 2025

సంగారెడ్డిలో వైభవంగా శివపార్వతుల కళ్యాణం

 

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 30 (SNM NEWS): సంగారెడ్డిలోని శివాజీ నగర్ లో శౌర్య యువజన సంఘం ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. సంగారెడ్డి పట్టణానికి చెందిన అనుముల సంజన, అనుముల సంతోష్ కుమార్ దంపతుల ఆధ్వర్యంలో కల్యాణాన్ని భక్తిశ్రద్ధలతో అంగర వైభవంగా జరిపించారు. అనంతరం సుమారు 500 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు పిట్టల రమేష్ సభ్యులు ద్వారక రవి శివ, మహేష్ చారి, చారి, రేవంత్, భాను, శేఖర్, చిన్న తదితరులు పాల్గొన్నారు.

Monday, September 22, 2025

పట్నం మాణిక్యం జన్మదిన సందర్భంగా అన్నదానం, పండ్ల పంపిణీ

 

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 22 (SNM NEWS): అన్నం పరబ్రహ్మ స్వరూపం, దేవుడు అందరినీ ఒకేలాగా పుట్టించలేదు కానీ ఆకలిని మాత్రం ఒకే విధంగా పుట్టించాడు. ఆకలి అన్నవారికి మనం పట్టెడన్నం పెడదాము, వారి అలసిన కన్నుల్లో ఆనందాన్ని చూద్దాం అంటూ,  పట్నం మాణిక్యం ఫౌండేషన్ గత కొన్ని సంవత్సరాలుగా అన్నదానం చేస్తూనే ఉంది. సోమవారం పట్నం మాణిక్యం డిసిసిబి వైస్ చైర్మన్ ఉమ్మడి మెదక్ జిల్లా జన్మదిన సందర్భంగా సంగారెడ్డి పట్టణం ప్రభుత్వాసుపత్రిలోని వందలాది మందికి అన్నదానం, పండ్ల పంపిణీ చేసి తమ ప్రియతమ నాయకునికి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన సంగారెడ్డి నియోజకవర్గం పిఎంకె యువసేన నాయకులు. ఈ కార్యక్రమంలోని టిఆర్ఎస్ నాయకులు, పిఎంకె యువసేన నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు.



వాసవి దేవాలయంలో ప్రారంభమైన శరణన్నవరాత్రి వేడుకలు



సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 22 (SNM NEWS): సంగారెడ్డి పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శరన్నవరాత్రి వేడుకలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి పూజ ఆలయ కమిటీ చైర్మన్ తో పాజి అనంత కిషన్ దంపతుల ఆధ్వర్యంలో జరిగాయి. అమ్మవారికి పంచామృతాలతో ప్రత్యేక కార్యక్రమాలను చేశారు. మొదటిరోజు అమ్మవారిని దుర్గామాత రూపంలో ప్రత్యేకంగా అలంకరించారు. తొలిరోజు పూజలు ఆలయ కమిటీ చైర్మన్ తో పాటు బాలూరి శంకర్, తాటికొండ జగదీశ్వర్, కన్నయ్యగారి మనోహర్, మిరియాల లక్ష్మీనారాయణ,  సంతోష్ దంపతులు కూర్చున్నారు. 

ప్రతిరోజు అమ్మవారిని గొప్ప రూపంలో అలంకరిస్తామని ఆలయ కమిటీ చైర్మన్ తోపాజి అనంత కిషన్ తెలిపారు. భక్తులు అమ్మవారిని అధిక సంఖ్యలో దర్శించుకున్నారు.

Saturday, September 20, 2025

దళిత జర్నలిస్టుల అభివృద్ధికి కట్టుబడి ఉంటా -మంత్రి వివేక్ వెంకటస్వామి

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 20 (SNM NEWS): రాష్ట్ర వ్యాప్తంగా నుండి వచ్చిన దళిత జర్నలిస్టులను కలుసుకోవడం ఆనందంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో శుక్రవారం జరిగిన దళిత జర్నలిస్టుల ఫోరమ్ రాష్ట్ర మహాసభలో ముఖ్య అతిథిగా కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత సోదరుల హక్కులు దక్కించుకోవడమే ప్రధాన లక్ష్యం అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో దళితుల సమస్యలపై ఇప్పటికే చర్చ జరిగినట్లు గుర్తు చేశారు. బడ్జెట్‌లో 18 శాతం నిధులు కేటాయిస్తే దళితుల సమస్యల పరిష్కారం సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. గత టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కష్టంగా ఉన్నప్పటికీ, దళితుల సమస్యలు తప్పకుండా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మీ సమస్యలను నేను స్వయంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా అని మంత్రి భరోసా ఇచ్చారు. దళితుల అభ్యున్నతికి తన తండ్రి కాకా వెంకటస్వామి చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ, నేను కూడా అదే మార్గంలో నడుస్తూ దళితుల అభివృద్ధికి కట్టుబడి ఉంటా అని స్పష్టం చేశారు. రైతు బంధు పథకాన్ని అమలు చేస్తున్నప్పుడు దళితుల భూమి సమస్యపై అన్యాయం జరగకూడదని అప్పుడు కూడా తన కుటుంబం అభిప్రాయం వ్యక్తం చేసిందని గుర్తు చేశారు. దళితుల కోసం నేను ఎల్లప్పుడూ మీతో ఉంటా, మీ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పని చేస్తా అని మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర దళిత జర్నలిస్టు ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు కాశపాగు జాన్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రత్నకుమార్, దళిత జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు తలారి యాదగిరి, సంగారెడ్డి జిల్లా దళిత జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు రాపాక విజయరాజు, వివిధ జిల్లాల అధ్యక్షులు కార్యదర్శులు దళిత జర్నలిస్టులు పాల్గొన్నారు.

Friday, September 19, 2025

సంగారెడ్డిలో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం

 


సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 19 (సిరి న్యూస్):

సంగారెడ్డిలో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం శనివారం రోజు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలంగాణ సెంట్రల్ జోన్ కమిటీ మెంబర్ మిట్టపల్లి రాజేశ్వర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ దిడ్డి సుధాకర్. తెలంగాణ సెంట్రల్ జోన్ కమిటీ మెంబర్ సాల్మన్ రాజు పాల్గొంటారని ఆయన సూచించారు. అదేవిధంగా పటాన్చెరువు, సంగారెడ్డి, అందోల్, నర్సాపూర్, మెదక్, జహీరాబాద్, నారాయణఖేడ్, తదితర ప్రాంతాలతో పాటు ప్రజలు కార్యకర్తలు యువకులు మహిళలు పాల్గొనాలని ఆయన సూచించారు. పార్టీ కార్యాలయం ఆఫీసు సాయిబాబా మందిరం పక్కన ఉందని ఆయన వెల్లడించారు. అదేవిధంగా జిల్లా కార్యకర్తల సమావేశం కూడా నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజలు పార్టీ నాయకులు తప్పకుండా హాజరుకావాలని ఆయన సూచించారు.

Thursday, September 18, 2025

సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం మహిళ అక్కడికక్కడే మృతి

సంగారెడ్డి, సెప్టెంబర్ 18 (SNM NEWS): సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో సిగ్నల్ పడ్డా కూడా లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో లారీని అతివేగంగా నడపడం వలన లారీ ముందు ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులను ఢీకొట్టడం జరిగింది. ఈ ప్రమాదంలో సంఘటన స్థలంలోనే ఒక మహిళ మృతి చెందగా మరో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. గాయపడ్డ ఇద్దరు వ్యక్తులను సంగారెడ్డి రూరల్ పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అలాగే ఈ ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకొని సంగారెడ్డి రూరల్ పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. ఈ క్రమంలో భాగంగా జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వగా ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ జామును పునరుద్ధరించారు

Wednesday, September 17, 2025

ఆర్ఆర్ఆర్ భూసేకరణ పనుల వేగవంతం చేయాలి -జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య

 

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 17 (SNM NEWS): జిల్లాలో జరుగుతున్న భూసేకరణ పనుల  వేగవంతం చేయాలని  జిల్లా కలెక్టర్ పి  ప్రావీణ్య , రెవెన్యూ అధికారులను ఆదేశించారు . బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో  రెవెన్యూ అధికారులతో రీజినల్ రింగ్ రోడ్, రోడ్ ఓవర్ బ్రిడ్జీలు  నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మాన్యుఫాక్చరింగ్ జోన్ కోసం జరుగుతున్న భూసేకరణ అంశాలను సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భముగా కలెక్టర్ మాట్లాడుతూ భూసేకరణలో ప్రజల న్యాయమైన హక్కులు కాపాడబడేలా, రైతులకు న్యాయం జరుగేలా, అలాగే అభివృద్ధి ప్రాజెక్టులు ఆలస్యం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పెద్దాపూర్, గిర్మాపూర్ శివాంపేట్ మండలాల్లో భూసేకరణ సమస్యలపై సవివర చర్చ జరిపి, వాటికి సాధ్యమైన పరిష్కారాలను సూచించారు. ముఖ్యంగా రీజినల్ రింగ్ రోడ్ భూసేకరణ విషయమై భూముల  సమస్యలు ఉత్పన్నం కాకుండా  చర్యలు చేపట్టాలని అన్నారు . భూసేకరణలో న్యాయం జరిగేలా  విక్రయ విలువలను ఆధారంగా పరిగణించాల్సిందిగా పేర్కొన్నారు. అదేవిధంగా, జహీరాబాద్ పరిధిలో ఏర్పాటు చేయబోతున్న నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మాన్యుఫాక్చరింగ్ జోన్ నిమ్జ్ కు సంబంధించిన భూసేకరణ పురోగతిని కూడా కలెక్టర్ సమీక్షించారు. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (టి జి ఐ ఐ సి)ల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం మేరకు, నిమ్జ్ లో భాగంగా జహీరాబాద్ స్మార్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి చేయబడనున్నది. ఈ నేపథ్యంలో పారిశ్రామిక కారిడార్ కోసం అవసరమైన భూముల సేకరణపై అధికారులు సమగ్ర నివేదికను సమర్పించారు. ఈ సమీక్షలో అదనపు కలెక్టర్ మాధురి, రెవెన్యూ అధికారులు, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మాన్యుఫాక్చరింగ్ జోన్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

గాంధీ విగ్రహానికి జర్నలిస్టుల సమస్యలపై వినతి..!

-ఇంటి స్థలాలు, హెల్త్ కార్డులు, అక్రిడిటేషన్లు మంజూరు చేయాలని జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి డిమాండ్ సంగారెడ్డి అక్టోబర్ 2 (SN...