రాయికోడ్, జూలై 25 (SNM న్యూస్): రాయికోడ్ మండలంలోని మామిడిపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త కత్తెర బసంతి గుండెపోటుతో మృతి చెందగా, ఆయన అంత్యక్రియలు శనివారం గ్రామంలో విషాద వాతావరణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ మహబూబ్ పటేల్, రాయికోడ్ మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు చేవెళ్ల విట్టల్, మండల కార్యదర్శి శంకర్, పార్టీ సీనియర్ నాయకుడు టోపాల రాములు, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు హాజరై నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మహబూబ్ పటేల్ మాట్లాడుతూ బసంతి మరణం పార్టీకి, గ్రామానికి తీరని లోటని, ఆయన సేవలను ఎప్పటికీ మరువలేమని అన్నారు. అనంతరం బసంతి కుమారుడు, వార్డు సభ్యుడు సతీష్‌తో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అంత్యయాత్రలో సర్పంచ్ మహబూబ్ పటేల్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు టోపాల రాములు స్వయంగా బసంతి పాడె మోస్తూ భావోద్వేగానికి గురయ్యారు. పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని బసంతికి తుదివీడ్కోలు పలికారు.
No comments:
Post a Comment