Wednesday, June 03, 2026

సేవా భావంతో హరీష్ రావు పుట్టినరోజు వేడుకలు


తెల్లాపూర్, జూన్ 3: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు జన్మదిన వేడుకలను పురస్కరించుకొని గురువారం తెల్లాపూర్‌లో తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం మాజీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ తెల్లాపూర్ సర్పంచ్ మల్లేపల్లి సోమిరెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనాధ పిల్లలకు దుస్తులు, టిఫిన్ బాక్సులు పంపిణీ చేయడంతో పాటు రూ.30 వేల ఆర్థిక సహాయం అందజేశారు. కేసీఆర్ నగర్ బీఆర్ఎస్ నాయకులు షకీల్ రూ.5 వేల సహాయం చేశారు. ఆయన మాట్లాడుతూ.. హరీష్ రావు నాయకత్వంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెల్లాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధి చెందిందని తెలిపారు. కార్యక్రమంలో తెల్లాపూర్ డివిజన్ బీఆర్ఎస్ నాయకులు, మాజీ కౌన్సిలర్లు, వార్డు సభ్యులు, కేసీఆర్ నగర్ బీఆర్ఎస్ కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగి జి. శంకరయ్య గౌడ్‌కు ఘనంగా ఉద్యోగ విరమణ సన్మానం

ఎద్దుమైలారం, సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 1 (SNM న్యూస్): ఎద్దుమైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 41 సంవత్సరాల పాటు సుదీర్ఘ సేవలంది...