Monday, June 01, 2026

రామ్ నగర్, 22 వ వార్డులో గ్రామైక్య సంఘ మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసిన టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి


సంగారెడ్డి పట్టణం లోని 22 వ వార్డ్ రామ్ నగర్ లో గ్రామైక్య మహిళా సంఘ సభ్యులకు నిర్మలా జగ్గారెడ్డి ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు.  రామ్ నగర్, రామ్ మంధిర్ లోని ఆమె స్వగృహం లో , స్థానిక కౌన్సిలర్ శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యం లో ఈ చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యం లోని   కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా పక్షపాతిగా ఉందని, ఏ ప్రభుత్వ కార్యక్రమం మొదలుపెట్టినా మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. మహిళలకు నాణ్యమైన చీరలను పంపిణీ చేస్తుందని, గత ప్రభుత్వం లో పంపిణీ చేసిన చీరలను పొలాల వద్ద  బెదురు కోసం వాడిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్  కూన వనితా సంతోష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అశోక్ రెడ్డి, వార్డు పెద్దలు కల్పన తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

గాంధీ విగ్రహానికి జర్నలిస్టుల సమస్యలపై వినతి..!

-ఇంటి స్థలాలు, హెల్త్ కార్డులు, అక్రిడిటేషన్లు మంజూరు చేయాలని జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి డిమాండ్ సంగారెడ్డి అక్టోబర్ 2 (SN...