మల్కాపూర్ గ్రామ శివారులో నూతనంగా ఏర్పాటు చేసిన వారణాసి హోటల్ రెస్టారెంట్‌ను సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారు, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ గారు ప్రారంభించారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో హోటల్‌ను ఏర్పాటు చేయడంపై వారు నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా యువత స్వయం ఉపాధి అవకాశాలను వినియోగించుకొని ముందుకు రావాలని సూచించారు. స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఇలాంటి వ్యాపార సంస్థలు మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అనంతరం హోటల్ నిర్వాహకులు ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారిని, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ గారిని శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, విఠల్ , గోవర్ధన్ , శ్రీధర్ రెడ్డి, గోవర్ధన్ నాయక్ ,అంజాద్,దేవేందర్ తదితరులు ఉన్నారు.

No comments:
Post a Comment