సంగారెడ్డి మే 28: సంగారెడ్డి మండలం ఫసల్వాదిలోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో ప్రపంచంలోనే అతిపెద్ద నందీశ్వర విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి తెలిపారు. ఆశ్రమంలో గురువారం మీడియాతో ఆయన మాట్లాడారు. 30 అడుగుల పొడవు, 13 అడుగుల వెడల్పు, 19 అడుగుల ఎత్తులో నందీశ్వర విగ్రహాన్ని తయారు చేయిస్తామని చెప్పారు. రాయి బరువు 684 టన్నులు ఉంటుందన్నారు. విగ్రహం కు సంబంధించిన రాయి కంది మండలం ఎర్థనూర్ శివారులోని కల్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం సమీపంలో లభ్యమైనట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేపాక్షి వీరభద్ర స్వామి దేవాలయం లో ఉన్న నంది ప్రస్తుతం అతిపెద్ద విగ్రహం అని చెప్పారు. ఆశ్రమంలో త్వరలో ఏర్పాటుచేసే నంది విగ్రహం దానికంటే ఎత్తు బరువు ఉంటుందని పేర్కొన్నారు. త్వరలో భారీ వాహనంలో ఊరేగింపుగా ఆశ్రమానికి తీసుకువస్తామని తెలిపారు. విద్యాపీఠం మీడియా ఇన్ఛార్జి తోపాజి అనంత కిషన్ మాట్లాడుతూ బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో అతిపెద్ద నందీశ్వర విగ్రహం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని చెప్పారు. ఇందులో తాను కూడా భాగస్వామిని కావడం పూర్వజన్మ అదృష్టమని పేర్కొన్నారు. అనంతరం నందీశ్వర ప్రతిమను ఆవిష్కరించారు. సమావేశంలో సభ్యులు ప్రశాంత్ కుమార్ పాల్గొన్నారు.
ప్రాంతీయ నుంచి జాతీయ స్థాయి వరకు తాజా రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, సమాజం, విద్య, ఉద్యోగాలు, క్రీడలు, ప్రత్యేక కథనాలను నిష్పక్షపాతంగా అందించే విశ్వసనీయ తెలుగు న్యూస్ బ్లాగ్. నిజమైన వార్తలతో ప్రజల గళంగా నిలుస్తుంది.
Thursday, May 28, 2026
జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో నందీశ్వర శిలాలభ్యత పై మీడియా సమావేశం
Subscribe to:
Post Comments (Atom)
నూతన డీఈఓ రోహిణికి శుభాకాంక్షలు
సంగారెడ్డి, జూన్ 10: సంగారెడ్డి జిల్లా నూతన జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ)గా బాధ్యతలు చేపట్టిన శ్రీమతి రోహిణి గారిని తెలంగాణ ప్రదేశ్ రాష్...
-
సంగారెడ్డి, డిసెంబర్ 21 (SNM NEWS): వికారాబాద్ జిల్లా కోటిపల్లి సర్పంచ్ సంగయ్య స్వామిపై జరిగిన దాడికి సంగారెడ్డిలో ఆదివారంనాడు జంగమ అర్చక ప...
-
సంగారెడ్డి, డిసెంబర్ 18 (SNM NEWS): పటాన్చేరు ప్రాంత ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం జీవితాంతం పోరాడిన పర్యావరణ యోధుడు దివంగత డా. అ...
-
సంగారెడ్డి అక్టోబర్ 22 (ఎస్ఎన్ఎం న్యూస్): సంగారెడ్డి నుంచి తిరుపతి కాణిపాకం అరుణాచలం మీదుగా శబరిమల వరకు మహా పాదయాత్ర వెళ్లిన సాహితీ రాము...

No comments:
Post a Comment