సంగారెడ్డి ప్రతినిధి, ఫిబ్రవరి 27 (SNM న్యూస్): దేశ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ పార్లమెంట్ సాక్షిగా ఎప్పటికప్పుడు విలువైన సూచనలు, సలహాలు ఇస్తున్నారని, అయితే వాటిని అమలు చేయడంలో ప్రధాని నరేంద్ర మోడీ పూర్తిగా విఫలమవుతున్నారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శించారు. న్యూఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ, దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకముందే రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారని గుర్తు చేశారు. విదేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినా, ప్రధాని ఆ సలహాలను వినడమే తప్ప అమలు చేయలేదని ఆరోపించారు. ఆ నిర్లక్ష్య ఫలితంగానే దేశం రెండేళ్లపాటు కరోనా మహమ్మారితో తీవ్రంగా నష్టపోయిందని, కోట్లాది మంది ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని జగ్గారెడ్డి పేర్కొన్నారు. అలాగే న్యూఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై కూడా రాహుల్ గాంధీ బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా పార్లమెంట్‌లో గళమెత్తుతూ, కాలుష్య నియంత్రణకు అవసరమైన స్పష్టమైన సూచనలు చేస్తున్నారని తెలిపారు. అయితే ఈ విషయంలో కూడా ప్రధాని ఆ సూచనలను పరిగణనలోకి తీసుకోవడం లేదని విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడిగా దేశ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా రాహుల్ గాంధీ నిరంతరం సలహాలు, సూచనలు ఇస్తున్నప్పటికీ, వాటిని కార్యరూపం దాల్చేలా చేయడంలో ప్రధాని మోడీ విఫలమవుతున్నారని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.
ప్రాంతీయ నుంచి జాతీయ స్థాయి వరకు తాజా రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, సమాజం, విద్య, ఉద్యోగాలు, క్రీడలు, ప్రత్యేక కథనాలను నిష్పక్షపాతంగా అందించే విశ్వసనీయ తెలుగు న్యూస్ బ్లాగ్. నిజమైన వార్తలతో ప్రజల గళంగా నిలుస్తుంది.
Saturday, February 28, 2026
బాధ్యత గల ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ సూచనలు – అమలు చేయడంలో ప్రధాని వైఫల్యం: జగ్గారెడ్డి
Subscribe to:
Post Comments (Atom)
నూతన డీఈఓ రోహిణికి శుభాకాంక్షలు
సంగారెడ్డి, జూన్ 10: సంగారెడ్డి జిల్లా నూతన జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ)గా బాధ్యతలు చేపట్టిన శ్రీమతి రోహిణి గారిని తెలంగాణ ప్రదేశ్ రాష్...
-
సంగారెడ్డి, డిసెంబర్ 21 (SNM NEWS): వికారాబాద్ జిల్లా కోటిపల్లి సర్పంచ్ సంగయ్య స్వామిపై జరిగిన దాడికి సంగారెడ్డిలో ఆదివారంనాడు జంగమ అర్చక ప...
-
సంగారెడ్డి, డిసెంబర్ 18 (SNM NEWS): పటాన్చేరు ప్రాంత ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం జీవితాంతం పోరాడిన పర్యావరణ యోధుడు దివంగత డా. అ...
-
సంగారెడ్డి అక్టోబర్ 22 (ఎస్ఎన్ఎం న్యూస్): సంగారెడ్డి నుంచి తిరుపతి కాణిపాకం అరుణాచలం మీదుగా శబరిమల వరకు మహా పాదయాత్ర వెళ్లిన సాహితీ రాము...

No comments:
Post a Comment