Wednesday, February 04, 2026

భూలక్ష్మి గోశాల సందర్శన గోరక్ష–గోసంవర్ధనకు పిలుపు

 

సైదాబాద్, ఫిబ్రవరి 3(SNM NEWS): 
ఆదర్శ గోశాలల సందర్శనలో భాగంగా సైదాబాద్‌లోని భూలక్ష్మి గోశాలను అఖిల భారత విశ్వ హిందూ పరిషత్ నాయకులు, గోభక్తులు సందర్శించి గోమాతలకు విశేష పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి విశ్వ హిందూ పరిషత్ అఖిల భారత గోరక్ష విభాగం కన్వీనర్ శ్రీ దినేష్ చంద్ర ఉపాధ్యాయ్ జీ, అఖిల భారత విశ్వ హిందూ పరిషత్ కేంద్ర సహకార్యదర్శి శ్రీ ఆకారపు కేశవరాజు జీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అంతరించిపోతున్న గోసంతతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని అన్నారు. గోరక్షణ, గోసంవర్ధన, గోపోషణ, గోసమృద్ధి లక్ష్యంగా సమిష్టిగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రాంత సంఘ్ చాలక్ శ్రీ సుందర్ రెడ్డి, గోరక్ష క్షేత్ర ప్రముఖులు యాదగిరిరావు, తెలంగాణ ప్రాంత గోరక్ష ప్రముఖుడు సుభాష్ చంద్ర, గోరక్ష తెలంగాణ ప్రాంత సహకార్యదర్శి ఎన్. శ్యామ్ పాల్గొన్నారు. భూలక్ష్మి గోశాల అధ్యక్షులు శ్రీ సుందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి అరవింద్, కమిటీ సభ్యులు కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం సాయంత్రం 8 గంటలకు బాలకృష్ణ గురుస్వామితో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి వచ్చిన రిధి గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతి ఇచ్చారు. గోమాత ఆశీర్వాదం పొందారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత గోసేవ ఫౌండేషన్ సభ్యులు లోకేష్ యాదవ్, మల్లేష్ గౌడ్, రాఘవేందర్, మాణిక్ యాదవ్, శ్యామ్, సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అభిమానానికి ప్రతిగా అండగా నిలిచిన జగ్గారెడ్డి చెప్పులు కుట్టే కార్మికుడికి రూ.50 వేల ఆర్థిక సహాయం

  సంగారెడ్డి, ఫిబ్రవరి 10 (SNM NEWS): సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. మానవతా విలువలకు ప్రతీకగా నిల...