Saturday, February 07, 2026

అభివృద్ధి కావాలంటే బ్యాట్ గుర్తుకు ఓటు వేయండి. ..ఆశీర్వదించండి గొల్ల విజయలక్ష్మి–ఆంజనేయులు

 

సంగారెడ్డి ప్రతినిధి, ఫిబ్రవరి 6 (SNM NEWS): సంగారెడ్డి పట్టణ 30వ వార్డు ఇండిపెండెంట్ కౌన్సిలర్ అభ్యర్థి గొల్ల విజయలక్ష్మి–ఆంజనేయులు మాట్లాడుతూ, “ఒక్క అవకాశం ఇవ్వండి… వార్డు అభివృద్ధి చేసే పూర్తి బాధ్యత నాదే” అని ప్రజలను కోరారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సంతోష్ నగర్, సాయి కృప నగర్, అయ్యప్ప కాలనీలలో రహిమత్ నగర్ ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి ఓటర్లను ఆప్యాయంగా పలకరిస్తూ, వార్డు సమస్యలను తెలుసుకున్నారు. తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, వీధి దీపాలు, పారిశుధ్యం వంటి సమస్యలను ప్రాధాన్యతగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల మధ్యే ఉంటూ, ప్రజల కోసం పనిచేసే కౌన్సిలర్‌గా నిలుస్తానని, పార్టీలకు అతీతంగా అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతానని ఆమె పేర్కొన్నారు. స్వచ్ఛమైన పాలన, పారదర్శకతతో 30వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో జనార్ధన్, తుల్జారాం, అజీజ్,సాయి కృప, అఖిల్, శ్రీధర్, తూర్పు ఆంజనేయులు, అరుణ్ చారి, కృష్ణ, ఆశిష్, వంశీ, సాయి తదితరులు పాల్గొని మద్దతు తెలిపారు.

No comments:

Post a Comment

అభిమానానికి ప్రతిగా అండగా నిలిచిన జగ్గారెడ్డి చెప్పులు కుట్టే కార్మికుడికి రూ.50 వేల ఆర్థిక సహాయం

  సంగారెడ్డి, ఫిబ్రవరి 10 (SNM NEWS): సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. మానవతా విలువలకు ప్రతీకగా నిల...