Saturday, February 21, 2026

పార్కిన్సన్స్ వ్యాధి పట్ల జాగృతి కార్యక్రమం

 


సంగారెడ్డి ప్రతినిధి, ఫిబ్రవరి 20 (SNM న్యూస్): పార్కిన్సన్స్ వ్యాధి  అనేది మెదడులోని నాడీ కణాలు దెబ్బతినడం వల్ల డోపమైన్ అనే రసాయనం తగ్గడంతో ఏర్పడే దీర్ఘకాలిక నరాల సంబంధిత వ్యాధి అంటూ దీనికై యశోద హాస్పిటల్స్, హైటెక్ సిటీ యూనిట్ సిద్ధంగా ఉందని యశోద హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ రాజేష్ అలుగు తెలిపారు. సంగారెడ్డి ఐఎంఏ హాల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అరుదైన డిబిఎస్ చికిత్స వివరాలను వెల్లడించారు. డిప్ బ్రెయిన్ స్టిమ్యూలేషన్ (డిబిఎస్) చికిత్స కోసం అత్యాధునిక పరికరాలతో యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ యూనిట్ సిద్ధంగా ఉందని తెలియచేస్తూ.. ఇది ప్రధానంగా కదలికలను ప్రభావితం చేస్తుంది, వణుకు, కండరాల బిగుతు, నెమ్మదిగా కదలడం వంటి లక్షణాలను కలిగిస్తుంది. ఇది ఎక్కువగా వృద్ధులలో కనిపిస్తుంది, దీనికి శాశ్వత నివారణ లేదు, కానీ మందులు, థెరపీలతో లక్షణాలను నియంత్రించవచ్చు అన్నారు. ఈ వ్యాధికి సంబంధించి ముఖ్యమైన లక్షణాలు వణుకు: ముఖ్యంగా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు చేతులు, కాళ్లు, దవడ లేదా ముఖంలో వణుకుతుంటాయని తెలియచేసారు. కదలికలలో నెమ్మదనం:  సాధారణ పనులు చేయడానికి ఎక్కువ సమయం పడుతుండడం, కండరాల బిగుతు చేతులు, కాళ్లు లేదా కాండం కండరాలు బిగుతుగా మారడం, సమతుల్యత లోపించడం నడవడంలో ఇబ్బంది, పడిపోవడం, నడకలో మార్పులు ఇతర లక్షణాలు: మాట్లాడటంలో ఇబ్బంది, చిన్నగా రాయడం, వాసన తెలియకపోవడం, నిద్ర సమస్యలు, మలబద్ధకం మొదలగు కనిపిస్తుంటాయని తెలియజేశారు. పార్కిన్సన్ వ్యాధి పట్ల జాగ్రత్తలు, వ్యాధి లక్షణాలు వ్యాప్తి గురించి వివరించారు. పిడిఏంఆర్సి కేసులను విజయవంతంగా నిర్వహించినట్లు వెల్లడించారు. చికిత్స అనంతరం కోలుకున్న పార్కిన్సన్ రోగుల వీడియోలను ప్రదర్శిస్తూ, సరైన సమయంలో సరైన వైద్యం తీసుకుంటే మంచి ఫలితాలు సాధ్యమని తెలిపారు.

No comments:

Post a Comment

నూతన డీఈఓ రోహిణికి శుభాకాంక్షలు

  సంగారెడ్డి, జూన్ 10: సంగారెడ్డి జిల్లా నూతన జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ)గా బాధ్యతలు చేపట్టిన శ్రీమతి రోహిణి గారిని తెలంగాణ ప్రదేశ్ రాష్...