రాయికోడ్ జూన్ 4: వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రభలకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరు పరిసరాల పరిశుభ్రత పాటించాలని రాయికోడ్ ఎంపిడిఓ ఎం.ఎం షరీఫ్ అన్నారు. గురువారం రాయికోడ్ మండల పరిధిలోని మామిడిపల్లి గ్రామం లో సర్పంచ్ షబానా నాజ్ మహబూబ్ పటేల్ ఆధ్వర్యంలో ప్రజాపాలన పల్లెప్రగతి గ్రామ సభ నిర్వహించారు. సమావేశానికి ఎంపిడిఓ హాజరై మాట్లాడుతూ గ్రామాభివృద్ధి, వర్షాకాల సన్నద్ధత, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా తదితర అంశాలపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సురక్షిత త్రాగునీటి వినియోగం, ఘన వ్యర్థాల నిర్వహణ, జల సంరక్షణ అవసరం, మొక్కల పెంపకం ద్వారా పర్యావరణ పరిరక్షణ, వన మహోత్సవ కార్యక్రమాల ప్రాధాన్యంపై అధికారులు వివరించారు. అలాగే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం, వరదల సమయంలో చేపట్టాల్సిన భద్రతా చర్యలపై గ్రామస్థులకు సూచనలు చేశారు.
గ్రామ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలు చురుకుగా భాగస్వాములు కావాలని, పరిశుభ్రమైన వాతావరణం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. గ్రామస్థులు పలు సమస్యలను సభ దృష్టికి తీసుకురాగా, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని అధికారులు, సర్పంచ్ షబానా నాజ్ మహబూబ్ పటేల్ హామీ ఇచ్చారు. అనంతరం గ్రామంలో సర్పంచ్ మహబూబ్ పటేల్ తో కలిసి పర్యటించి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన మంచి నీటి ఫిల్టర్ ను పరిశీలించి సర్పంచ్ ను అభినందించారు. ఈ సందర్బంగా మొక్కలు నాటి నీళ్లు పోశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి బస్వరాజ్, ఫీల్డ్ అసిస్టెంట్ అల్తాఫ్, వార్డ్ మెంబర్ లు, పలువురు గ్రామ స్థాయి అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


No comments:
Post a Comment