సంగారెడ్డి ప్రతినిధి, మే 16 : అల్-ఆరిఫ్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ విద్యార్థులు విద్యా ఫలితాల్లో ప్రతిభ కనబరిచారు. నిర్వహించిన పరీక్షల్లో విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకొచ్చారు. అల్-ఆరిఫ్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు జనాబ్ అల్‌హాజ్ తాహేర్ అలీ షా ఆరిఫీ నూరీ సాహెబ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంగారెడ్డి మాజీ కౌన్సిలర్ జనాబ్ అల్‌హాజ్ అమీర్ బేగ్ సాహెబ్, ఆరో వార్డు కౌన్సిలర్ జనాబ్ నవాజుద్దీన్ సాహెబ్, జనాబ్ అల్‌హాజ్ పాషా ముల్సాబ్ ఘనీ నూరీ సాహెబ్, జనాబ్ ఇక్బాల్ ముల్సాబ్ హాజరయ్యారు.
విద్యార్థుల్లో సయ్యదా సోహా సమర్ 557 మార్కులతో ప్రథమ స్థానం సాధించగా, యాస్మీన్ అంజుం 527 మార్కులతో ద్వితీయ స్థానం, సోహా సమీరా 516 మార్కులతో తృతీయ స్థానం పొందారు. అలాగే మహమ్మద్ షాదుల్లా 500, మహమ్మద్ యాసీన్ కల్మాజ్ 498, సోఫియా రజ్మిన్ 474, తబస్సుం ఫాతిమా 468, సుమ్మయ్యా బేగం 378 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించి, భవిష్యత్తులో మరింత ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అల్-ఆరిఫ్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రతినిధి జనాబ్ అల్‌హాజ్ మహమ్మద్ మహబూబ్ అలీ, ఉపాధ్యాయులు ఘయాజ్ పర్వేజ్, ఫహీముద్దీన్, ప్రధానోపాధ్యాయుడు సయ్యద్ అమెరుల్లా హుస్సేన్, ప్రధానోపాధ్యాయురాలు అస్రా మేడం తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యాభివృద్ధి, విద్యార్థుల భవిష్యత్ రూపకల్పన, నాణ్యమైన విద్యా బోధనపై చర్చించారు.


No comments:
Post a Comment