సంగారెడ్డి, నవంబర్ 21 (ఎస్ఎన్ఎం న్యూస్): భద్రాద్రి జిల్లాలో జరిగిన ఎస్ జి ఎఫ్ .క్రీడా పోటీల్లో భాగంగా నిర్వహించిన రైఫిల్ షూటింగ్ పోటీలో సంగారెడ్డి సెయింట్ ఆంథోనీ పాఠశాల విద్యార్థులు టీం సభ్యులు పాల్గొన్నారు. పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో భద్రాది కొత్తగూడెం రాష్ట్రస్థాయి తుపాకీ షూటింగ్ అండర్-14, 17 విభా గాల్లో బాల, బాలికలు పోటీలు నిర్వహించారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి వచ్చిన విద్యా ర్థులు షూటింగ్ లో ఉత్సాహంగా పాల్గొన్నారు. తుపాకీతో గురిని పేల్చారు. రైఫిల్ షూటింగ్ కోచ్ శశ్వంత్ ఆధ్వర్యంలో విద్యార్థులు బహుమతులు గెలుపు పొందారని తెలిపారు. జాతీయ స్థాయిలో జిల్లా టీం ప్రాతినిధ్యం వహించేలా కృషి చేస్తామని షూటింగ్ జిల్లా కార్యదర్శి శేశ్వంత్ తెలిపారు. అశ్వరావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ చేతులమీదుగా సర్టిఫికెట్లు పట్నం శెట్టి సాయి చరణ్ టీం అందుకున్నారు
ప్రాంతీయ నుంచి జాతీయ స్థాయి వరకు తాజా రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, సమాజం, విద్య, ఉద్యోగాలు, క్రీడలు, ప్రత్యేక కథనాలను నిష్పక్షపాతంగా అందించే విశ్వసనీయ తెలుగు న్యూస్ బ్లాగ్. నిజమైన వార్తలతో ప్రజల గళంగా నిలుస్తుంది.
Saturday, November 22, 2025
షూటింగ్ విజేతలకు కలెక్టర్, ఎమ్మెల్యే భినందనలు
సంగారెడ్డి శబరిమల మహా పాదయాత్ర విజయవంతం సంగారెడ్డి చేరుకున్న పాదయాత్ర బృందం
సంగారెడ్డి అక్టోబర్ 22 (ఎస్ఎన్ఎం న్యూస్): సంగారెడ్డి నుంచి తిరుపతి కాణిపాకం అరుణాచలం మీదుగా శబరిమల వరకు మహా పాదయాత్ర వెళ్లిన సాహితీ రాము గురు స్వామి మరియు వారి శిష్య బృందం సుమారు 1600 కిలోమీటర్లు యాత్ర విజయవంతం చేసుకుని శుక్రవారం సాయంత్రం సంగారెడ్డి తిరిగి చేరుకున్నారు. సంగారెడ్డిలో వారికి ఘన స్వాగతం లభించింది సంగారెడ్డి అయ్యప్ప స్వాములు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు వారికి కాళ్లు కడిగి హారతులు ఇచ్చి స్వాగతం పలికారు యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షులు కూన వేణు ఆధ్వర్యంలో పాదయాత్ర స్వాములను ఘనంగా సన్మానించారు. సంగారెడ్డి లోని సండే మార్కెట్ వద్ద గల అభయాంజనేయ స్వామి దేవాలయం నుండి నవరత్నాలయ దేవస్థానం వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. నవరత్నాలయ దేవస్థానం వద్ద సమావేశం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి సత్కారం మెమెంటో అందజేశారు. కూన వేణు మాట్లాడుతూ పాదయాత్ర అనేది జీవితంలో ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా చేయాలని పాదయాత్ర అనేది అతి కష్టమైన యాత్ర అని అలా మూడుసార్లు వెళ్లిన రాము స్వామి ఆధ్వర్యంలోని పాదయాత్ర బృందం సంగారెడ్డికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చారని ఆయన అన్నారు. అయ్యప్ప ఆపద్బాంధవ సేవ సమితి ఆధ్వర్యంలో పాదయాత్ర బృందానికి స్వాగతం పలికివారికి అభినందనలు తెలియజేశారు. సాహితీ రాము స్వామి మాట్లాడుతూ పాదయాత్ర ఐదు సార్లు చేయడం మా లక్ష్యం అని ఇప్పటివరకు మూడుసార్లు విజయవంతంగా పూర్తి చేశామని సంగారెడ్డి గురుస్వాములు మాత స్వాముల దీవెనలతో సాధ్యమైందని అలాగే మా పాదయాత్ర బృందం పూర్తిగా సహకరించి పాదయాత్ర విజయవంతం కావడానికి చాలా కష్టపడ్డారని తెలిపారు. నవంబర్ 30 వ తేదీన రాము స్వామి యొక్క 18వ మహా పడిపూజ ఉంది కావున ప్రతి ఒక్కరూ పూజకు హాజరై తమ ఆశీర్వాదాలు తెలియజేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో డాక్టర్ కూన వేణు అయ్యప్ప ఆపద్బాంధవ సేవా సమితి సభ్యులు, సంగారెడ్డి గురు స్వాములు, బంధుమిత్రులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Friday, November 21, 2025
షూటింగ్ విజేతలకు కలెక్టర్ అభినందనలు
సంగారెడ్డి, నవంబర్ 21 (ఎస్ఎన్ఏం న్యూస్): భద్రాద్రి జిల్లాలో జరిగిన ఎస్జీఎఫ్ క్రీడా పోటీల్లో భాగంగా నిర్వహించిన షూటింగ్ పోటీలో సంగారెడ్డి టీం సభ్యులు పాల్గొన్నారు. పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో భద్రాది కొత్తగూడెం జిల్లా స్థాయి తుపాకీ షూటింగ్ అండర్-14, 17 విభా గాల్లో బాల, బాలికలు పోటీలు నిర్వహించారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి వచ్చిన విద్యా ర్థులు షూటింగ్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. తుపాకీతో గురిని పేల్చారు. రైఫిల్ షూటింగ్లో కోచ్ శశ్వంత్ ఆధ్వర్యంలో విద్యార్థులు బహుమతులు గెలుపు పొందారని తెలిపారు. జాతీయ స్థాయిలో జిల్లా టీం ప్రాతినిధ్యం వహించేలా కృషి చేస్తామని షూటింగ్ జిల్లా కార్యదర్శి శేశ్వంత్ తెలిపారు. అశ్వరావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ చేతులమీదుగా సర్టిఫికెట్లు పట్నం శెట్టి సాయి చరణ్ టీం అందుకున్నారు.
సంగారెడ్డిలో ఘనంగా తోపాజీ అనంత కిషన్ జన్మదిన వేడుకలు
సంగారెడ్డి, నవంబర్ 21 (SNM న్యూస్): సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఐబీ లో TPCCప్రధాన కార్యదర్శి, ఆర్యవైశ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు, వాసవి మాఇల్లు స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు, వాసవి మహాసంస్థాన్ చైర్మన్, మాజీ గ్రంధాలయ సంస్థ ఉమ్మడి మెదక్ జిల్లా చైర్మన్, నిరంతరం ప్రజల సేవకై పరితపించే ప్రియతమ నాయకులు ఆత్మీయ శ్రీ తోపాజి అనంతకిషన్ పుట్టినరోజు పురస్కరించుకొని తోపాజిని భారీ గజమాలలు వేసి శాలువాలతో సత్కరించారు, టపాసులు కాలుస్తూ కేక్ కట్ చేసి డప్పు చప్పుళ్లతో వైభవంగా జరిపిన పుట్టినరోజు శుభాకాంక్షల కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘాల నేతలు సభ్యులు, సంగారెడ్డి పట్టణ, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, పట్టణ ప్రముఖులు,కుల సంఘాల నాయకులు, TNGOS నాయకులు మరియు టీం తోపాజి సభ్యులు మాధవనగర్ కాలనీ వాసులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు...
నంది విగ్రహ పనుల పూజా కార్యక్రమంలో పాల్గొన్న జగ్గారెడ్డి
సంగారెడ్డి ప్రతినిధి, నవంబర్ 20 (SNM NEWS): హిందూ, ముస్లిం, క్రిస్టియన్ తదితర మతాలకు సంబంధించిన ఆలయాలు, మసీదులు, ప్రార్థన మందిరాలు, ఇతర ధార్మిక కార్యక్రమాల కోసం సీఎం రేవంత్ రెడ్డి తో మాట్లాడి అవసరమైన నిధులు కేటాయించేలా చొరవ తీసుకుంటానని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పష్టం చేశారు. త్వరలో సంగారెడ్డి నియోజకవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చే అవకాశం ఉందని వివరించారు. సంగారెడ్డి మండలం ఫసల్వాది లోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో ప్రపంచంలోనే అతిపెద్ద నంది విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎర్దనూరు గుట్టల్లో అవసరమైన పెద్ద రాయి ఇందులో భాగంగా ఎర్దనూరు గుట్టల్లో అవసరమైన పెద్ద రాయిని కనుగొన్నారు. ఆ బండరాయిని సంగారెడ్డిలోని విద్యాపీఠానికి త్వరలోనే తీసుకొచ్చేలా పనులు ప్రారంభించారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఈ పనులను పరిశీలించారు. నంది విగ్రహ నమూనాను ఈ సందర్భంగా జ్యోతిర్వాస్తు విద్యాపీఠం సిద్ధాంతి డాక్టర్ మహేశ్వర శర్మ ఆయనకు వివరించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత కిషన్ తదితరులు పాల్గొన్నారు.
Thursday, November 20, 2025
ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడిగా రాపాక విజయరాజు
హైదరాబాద్, నవంబర్ 20( SNM న్యూస్):దళిత జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం పనిచేస్తున్న దళిత జర్నలిస్టు ఫోరం (డీజేఎఫ్ ) కీలక నిర్ణయం తీసుకుంది. మెదక్ జిల్లా అధ్యక్షుడిగా రాపాక విజయరాజును నియమిస్తూ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కాశపోగు జాన్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర కార్యదర్శి ఏ. డేవిడ్ అధికారిక ప్రకటనను విడుదల చేశారు. ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు కాశ పోగు జాన్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ల వర్కింగ్ ప్రెసిడెంట్ రత్నకుమార్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ప్రాంగణంలో ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షునిగా రాపాక విజయరాజుకు నియామక పత్రం అందజేయడం జరిగింది.జిల్లా స్థాయి కార్యకలాపాలను బలోపేతం చేయడానికి, జర్నలిస్టు సమస్యలను మరింత ప్రభావవంతంగా పరిష్కరించడానికి రాపాక విజయరాజు నియామకం చేపట్టినట్లు ఫోరం తెలిపింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కాశపోగు జాన్ మాట్లాడుతూ దళిత జర్నలిస్టులకు ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని ఫోరం వ్యవస్థాపకుడు కాశపోగు జాన్ ప్రభుత్వం దృష్టికి రెండు ముఖ్యమైన డిమాండ్లను తీసుకొచ్చారు. దళిత జర్నలిస్టులకు రాష్ట్ర అక్రెడిటేషన్ కమిటీలో తక్షణమే ప్రతినిధిత్వం కల్పించాలని. అంబేద్కర్ అభయహస్తం పథకాన్ని దళిత జర్నలిస్టులకు మొదటి విడతలోనే మంజూరు చేయాలని జర్నలిస్టుల హక్కుల కోసం ఫోరం ఎల్లప్పుడూ పోరాటం చేస్తుందని, దళిత జర్నలిస్టుల పురోగతికి ఈ నిర్ణయాలు అత్యంత కీలకమని కాశపోగు జాన్ స్పష్టం చేశారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన రాపాక విజయరాజు, మెదక్ జిల్లాలో దళిత జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి, శిక్షణా కార్యక్రమాల నిర్వహణకు ప్రాధాన్యతనిస్తానని ఉమ్మడి జిల్లాలో ఉన్న దళిత జర్నలిస్టులందరినీ ఏకతాటిపై తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత జర్నలిస్టు ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు యాదగిరి ఎల్లేష్ జగత్ ప్రకాష్ పెద్దింటి స్వామి శ్రీకాంత్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
చిన్నారికి డ్రగ్-రిఫ్రాక్టరీ ఎపిలెప్సీకి ఇమేజ్- గైడెడ్ క్రానియోటమీ, లెసియోనెక్టమీని విజయవంతంగా నిర్వహించిన హైటెక్ సిటీ యశోద హాస్పిటల్స్
సంగారెడ్డి, 19 నవంబర్ (SNM న్యూస్): హైటెక్ సిటీ యశోద హాస్పిటల్స్ లెఫ్ట్ ప్యారిటల్ ఫోకల్ కార్టికల్ డిపార్డైసియా వల్ల కలిగిన డ్రగ్-రిఫ్రాక్టరీ ఫోకల్ ఎపిలెప్పీతో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడు. కపిల్ రెడ్డి దర్మారెడ్డికి విజయవంతంగా చికిత్స అందించింది. మూడు యాంటీ-ఎపిలెప్టిక్ మందులు వాడుతున్నప్పటికీ, ఆ బాలుడు తల, కళ్ళలో టానిక్ డీవియేషన్ లక్షణాలను అనుభవిస్తున్నాడు, దానితో పాటు కొంత సమయం స్పృహ కోల్పోతున్నాడు. మల్టీమోడల్ ఇమేజింగ్ న్యూరోలాజికల్ పరీక్షల తర్వాత, వైద్య బృందం శస్త్రచికిత్సను సిఫార్సు చేసింది. 21 ఫిబ్రవరి 2025న, పేషేంట్ కు ఎలక్ట్రోకార్టికోగ్రామ్ తో లెఫ్ట్ ఇమేజ్-గైడెడ్ క్రానియోటమీ, లెసియోనెక్టమ్ నిర్వహించారు. అధునాత మ్యాపింగ్-గైడెడ్ రిసెకన్ ఎపిలె ప్టోజెనిక్ ఫోకస్ యొక్క ఖచ్చితమైన గుర్తింపు, పూర్తి తొలగింపును సాధ్యం చేసింది. శస్త్రచికిత్స, శస్త్రచికిత్స తర్వాత కోలుకోవడం సజావుగా జరిగింది. బాలుడుని ఆరోగ్యకరమైన స్థితిలో డిశ్చార్జ్ చేశారు.ఈ మైలురాయి గురించి, సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, ఎపిలెఫ్టాలజిస్ట్ డాక్టర్ సాగర్ గుల్లపల్లి మాట్లాడుతూ, పిల్లలలో ఔషధ-నిరోధక మూర్ఛ వారి జీవన నాణ్యత, అభ్యాసం, రోజువారీ పనీతీరును గణనీయంగా ప్రభావితం చేస్తుంది. అధునాతన ఇమేజింగ్ మరియు ఇంట్రా ఆపరేటివ్ ఈ సి ఓ జి ఉపయోగించి మూర్చ, చూపు సమస్యలను ముందుగా ఖచ్చితంగా గుర్తించి శస్త్రచికిత్స చేయడం మంచి ఫలితాలను అందించడానికి మాకు వీలు కల్పిస్తుంది. యశోద హాస్పిటల్స్, అత్యాధునిక న్యూరో సర్జికల్ టెక్నాలజీ ద్వారా మద్దతు ఇవ్వబడిన ప్రపంచ స్థాయి ఎపిలెప్సీ కేర్ అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము. సురక్షితమైన ప్రభావవంతమైన నిర్వహణ కోసం బహుళ విభాగ నైపుణ్యాన్ని నిర్ధారిస్తూ సీనియర్ కన్సల్టెంట్ న్యూరో, స్పైన్ సర్జన్ డాక్టర్ బాల రాజ శేఖర్ చంద్ర పై, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, నియోనాటాలజిస్ట్ డాక్టర్ రవీందర్ గౌడ్ జంగంపల్లి సహకారంతో ఈ శస్త్రచికిత్స జరిగింది.యశోద హాస్పిటల్స్ పీడియాట్రిక్, పెద్దలకు మూర్ఛ సమస్యకు చికిత్సకు అత్యుత్తమ చికిత్స అందిస్తుంది, అధునాతన న్యూరోఇమేజింగ్, ఇంటర్వెన్షనల్ న్యూరాలజీ, మినిమల్లీ ఇన్వాసివ్ న్యూరో సర్జికల్ విధానాలను అందిస్తోంది.యశోద హాస్పిటల్స్ గురించి గత 30 సంవత్సరాలుగా హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో 4 బ్రాంచ్ లు (సికింద్రాబాద్, సోమాజిగూడ, మలక్పట్, హైటెక్ సిటీ) 4 వేల పడకలు కలిగి ఉన్న అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. వైద్య అవసరాలకు అనుగుణంగా అనుభవంతులైన వైద్యులచే, అధునాతన సాంకేతికతలతో ఇప్పుడు అందరికి చేరువలో కార్పొరేట్ వైద్య సేవలు. చురుకైన నాయకత్వం, బలమైన నిర్వహణ వైద్య చికిత్సలో అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలను అందించే అత్యుత్తమ కేంద్రంగా యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ అభివృద్ధి చెందింది. పేషంట్ అవసరాలకు అనుగుణంగా అనునిత్యం మార్గనిర్దేశం చేయబడుతుంది . అరుదైన సంక్లిష్టమైన విధానాలకు కూడా సంపూర్ణ మిళిత విప్లవాత్మక సాంకేతికత ద్వారా చికిత్సలను అందిస్తుంది. యశోద గ్రూప్ మెడిసిన్, సర్జరీకి సంబంధించిన ప్రతి స్పెషాలిటీ, సబ్ స్పెషాలిటీలో అధునాతన రోగనిర్ధారణ, చికిత్సా సంరక్షణను అందించడం ద్వారా వైద్య నైపుణ్యం, అధునాతన విధానాలను నిర్వహిస్తుంది. భారతదేశంలోనే అతిపెద్ద వైద్య సదుపాయాలలో ఒకటిగా భావిస్తున్న తెలంగాణలోని హైదరాబాద్లో 4000 పడకల సామర్థ్యంతో 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. సరసమైన ఖర్చులతో యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ -సేవలను అందిస్తుంది.
Wednesday, November 19, 2025
రాష్ట్ర ఈత పోటీల్లో రెండు రజత పతకాలు సాధించిన రెహమాన్
సంగారెడ్డి ప్రతినిధి, నవంబర్ 19 (ఎస్ ఎన్ ఎమ్ న్యూస్): సంగారెడ్డి పట్టణానికి చెందిన శ్లోకాస్ శ్రీవాణి హై స్కూల్ లో ఎనిమిదోవ తరగతి చదువుతున్న విద్యార్థి మహమ్మద్ అబ్దుర్ రహమాన్ సిద్దిఖ్ పెద్దపల్లి జిల్లా సెంచ్నరీ కాలనీ, రాణి రుద్రమదేవి స్టేడియం స్విమ్మింగ్ పూల్ లో నిర్వహించిన 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర స్థాయి ఈతల పోటీలో మూడో స్థానంలో నిలిచి వివిధ స్టాక్ లో రెండు రజత పతకాలు సాధించిచాడు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ శ్రీనివాసరావు మహమ్మద్ అబ్దుర్ రెహమాన్ ను అభినందించారు. ఇలాంటి పోటీల్లో రాష్ట్ర దేశస్థాయిలో మరింత ప్రతిభ కనబరిచి మంచి పేరు గడించాలని ఆశిస్తున్నానని తెలిపారు. సంగారెడ్డి జిల్లా ఎస్ జి ఎఫ్ స్విమ్మింగ్ పోటీలలో అత్యధిక పథకాలను సాధించినందుకు గాను జిల్లా ఇన్చార్జ్ శేషు కుమార్ కు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ శ్రీనివాస్ రావు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. స్విమ్మింగ్ కోచ్, సంగారెడ్డి జిల్లా సిమ్మింగ్ ఇంచార్జ్ శేషు కుమార్ మాట్లాడుతూ అబ్దుర్ రెహమాన్ అండర్ 14 లో బ్రెస్ట్ స్టాక్ 100 మీటర్స్ , ఇండివిజువల్ మెడ్లి 200 మీటర్స్ లో రెండు రజత పథకాలను సాధించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. డి వై ఎస్ ఓ కాసిం బేగ్ సంతోషం వ్యక్తం చేస్తూ మునుముందు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. డి ఎస్ ఏ సిబ్బంది అభినవ్, దీపిక, పవన్ కళ్యాణ్ స్విమ్మింగ్ పూల్ సిబ్బంది పవన్,కృష్ణ,కుమార్ రెహమాన్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.
సంగారెడ్డిలో ఘనంగా ఇందిరాగాంధీ 108వ జయంతి వేడుకలు
సంగారెడ్డి ప్రతినిధి, నవంబర్ 19 (SNM న్యూస్): సంగారెడ్డిలో ఇందిరా గాంధీ 108 వ జయంతి వేడుకలు టీపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా సంగారెడ్డిలో ఐబి వద్ద ఉన్న ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ ప్రపంచం గుర్తించిన గొప్ప నేత ఇందిరా గాంధీ అని, ఆమె కుటుంబం దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబం అని అన్నారు. సంగారెడ్డి, మెదక్ జిల్లా ప్రజలకు ఇందిరా గాంధీ తో ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. మెదక్ పార్లమెంట్ నుండి ఎంపిగా గెలిచి ప్రధాని అయ్యారు. అప్పటి మెదక్ జిల్లా కాంగ్రెస్ అగ్ర నేతలు రామ్ చంద్రా రెడ్డి, బాగా రెడ్డి ల కోరిక మేరకు ఇక్కడి నుండి ఎంపి గా పోటీ చేసి గెలిచారు. ఇందిరా గాంధీ ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పించాలి, ఉద్యోగాలివ్వాలనే సంకల్పంతో సంగారెడ్డి కి ఆర్డినెన్సు ఫ్యాక్టరీ తెచ్చారు. బిడిఎల్( భారత్ డైనమిక్స్ లిమిటెడ్) తెచ్చారు, ఇక్రిశాట్ తెచ్చారని, ఈ దేశం లో ప్రధాన మంత్రి గా ఇందిరా గాంధీ చేపట్టిన సంస్కరణలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాయి. గరిభి హాటావో నినాదంతో ఈ దేశంలో పేదరికాన్ని పారదోలారు. ఈ దేశం లోని భూమి లేని నిరుపేదలకు, రైతులకు భూములు పంచారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇల్లు లేని పేదలకు ఇళ్ల స్థలాలు పంచారు. రోటీ , కపడా ఔర్ మకాన్ నినాదంతో దేశంలోని నిరుపేదల స్థితిగతులను మార్చే కృషి చేశారు. బీజేపీ నాయకులను నేను ఒకటే ప్రశ్నించదలుచుకున్న చాలా సార్లు మోడీ , అమిత్ షా, బీజేపీ నేతలు మాట్లాడుతుంటారు. ఈ దేశం కోసం రక్తం ఇస్తా ప్రాణం ఇస్తాం అని బీజేపీ నేతలు అంటారు. కానీ ఏ బీజేపీ నాయకుడు ఇంతవరూ ఎవరు ఈ దేశం కోసం రక్తం ఇవ్వలేదు, ప్రాణం ఇవ్వలేదన్నారు. ఈ దేశం కోసం తన రక్తాన్ని , ప్రాణాలను ఇవ్వడానికి తాను సిద్దం అని ఇందిరా గాంధీ ఎన్నో సార్లు చెప్పారు. కేవలం మాటలు చెప్పడం కాదు ఆమె అన్నట్లుగానే ఈ దేశం కోసం తన రక్తాన్ని, ప్రాణాలు అర్పించిన వ్యక్తి ఇందిరా గాంధీ అని గుర్తు చేశారు. దేశం కోసం బీజేపీ నాయకులు ఎవరైనా తన రక్తాన్ని , ప్రాణాలను అర్పించారా? అని ప్రతిపక్ష పార్టీలను ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి తౌబాజీ అనంత కిషన్, ఆంజనేయులు, కూన సంతోష్, జార్జ్, ఇతర కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Saturday, November 15, 2025
పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సామూహిక కార్తీక మాస వనభోజనాలు
సంగారెడ్డి ప్రతినిధి, నవంబరు 15 (SNM న్యూస్): సంగారెడ్డిలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వనభోజన కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే తనయుడు బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చింత సాయినాథ్ హాజరయ్యారు. పద్మశాలి బంధువులు, సంఘ పెద్దలను చింత సాయినాథ్ ఆప్యాయంగా పలకరిచారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు, పెద్దలకు, యువతకు ధన్యవాదాలు తెలుపుతూ.. సంఘ ఐక్యతను మరింత బలోపేతం చేయాలని అయన సూచించారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘ ప్రతినిధులు చింతసాయినాథ్ని సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమాలతో వనభోజన వేడుక సందడిగా ముగిసింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత రాష్ట్ర పద్మశాలి సంఘం జనరల్ సెక్రెటరీ మాచర్ల రామచంద్రరావు, ఆల్ ఇండియా డాక్టర్స్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ సోమచంద్రశేఖర్, జిల్లా గౌరవ అధ్యక్షుడు పండరి, జిల్లా అధ్యక్షులు కొప్పెర హరి హర కిషన్, జిల్లా జనరల్ సెక్రెటరీ తాటికొండ అశోక్, అధ్యక్షుడు పట్టణ అధ్యక్షుడు గజేంద్ర కృష్ణ, జనరల్ సెక్రెటరీ సత్యనారాయణ, మహిళా అధ్యక్షురాలు మంజుల, సంగారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం నాయకులు కూలిపాక యాదగిరి, సోమ రమేష్, పుండరీకం, రాఘవులు, ముత్యాల ప్రసాద్, సాయి ప్రసాద్ శ్రీశైలం, గడ్డం శ్రీశైలం, బలరాం, మేకల జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.
ఈనెల 16న జరిగే న్యాయ సాధన దీక్షను జయప్రదం చేయండి
సంగారెడ్డి, నవంబర్ 15 (SNM న్యూస్): బిసి న్యాయ సాధన దీక్ష తెలంగాణ బి సి జేఏసీ చైర్మన్ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారి పిలుపుమేరకు తేదీ 16 నవంబర్ 2025 ఆదివారం నాడు ఉదయము 11 గంటల నుండి సాయంత్రము నాలుగు గంటల వరకు సంగారెడ్డి జిల్లాబిసి జేఏసీ ఆధ్వర్యంలోన్యాయ సాధన దీక్ష కలదు ఇట్టి న్యాయసాధన దీక్ష కొత్త బస్టాండ్ పక్కన నటరాజ్ టాకీస్ ముందు దీక్షా స్థలంను ఏర్పాటు చేయడం జరిగినది ఇట్టిదీక్ష ముఖ్య ఉద్దేశం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించుటకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేయడమే ముఖ్య ఉద్దేశం. ఇట్టి దీక్షను సంగారెడ్డి జిల్లా లోని అన్ని నియోజకవర్గ, పట్టణ మండల కేంద్రాల్లో బీసీ సోదరి సోదరులందరూ విజయవంతం చేయాలని కోరడం జరిగినది ఇట్టి దీక్ష ను న్యాయవాదులు డాక్టర్లు మేధావి వర్గంఉద్యోగస్తులు విశ్రాంతి ఉద్యోగస్తులు యువతియువకులు విద్యార్థిని విద్యార్థులు అన్నిబిసి కుల సంఘాల నాయకులు పాల్గొని విజయవంతం చేయగలరని జిల్లా బీసీ జేఏసీకన్వీనర్ ప్రభుగౌడ్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు సంగారెడ్డి జిల్లాబీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గోకుల్ కృష్ణ వైస్ చైర్మన్ శ్రీధర్ మహేంద్ర కన్వీనర్ పట్లోళ్ల మల్లికార్జున్ పాటిల్ కో కన్వీనర్లు రవి మానస మంగ గౌడ్ తదితరులు పాల్గొన్నారు...
దేశ ప్రజలు క్షేమంగా ఉండాలంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి -టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
సంగారెడ్డి ప్రతినిధి, నవంబరు 14 (SNM News): పండిట్ జవహర్ లాల్ నెహ్రు 136 వ జయంతి సందర్భంగా సంగారెడ్డి రామ్ నగర్ లో జగ్గారెడ్డి ఇంటి వద్ద బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ బీహార్ ఎన్నికల్లో ప్రజలు ఓటేశారా? మిషన్లు ఓట్లేశాయా? అర్థం కావడం లేదన్నారు. నేను రాహుల్ గాంధీ కి ఒకటే చెప్పదలుచుకున్న, బీహార్ పోతే పోయింది. కానీ రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధాని కావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దేశ ప్రజలు క్షేమంగా ఉండాలంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలన్నారు. మోతీలాల్ నెహ్రూ, జవహర్ లాల్ నెహ్రూ ల కుటుంబం ఈ దేశం కోసం ఆస్తులు పంచారు, ప్రాణాలిచ్చారు.. మంచి పరిపాలన చేశారు. కొంతమంది రాజకీయ మూర్ఖులు ఆ కుటుంబం దేశం కోసం ఏం చేసిందని మాట్లాడటం బాధాకరం అని అన్నారు. భారత దేశ మొట్టమొదటి ప్రధాన మంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ 136 వ జయంతి సందర్భంగా టీపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డి లో ఘనంగా బాలల దినోత్సవ కార్యక్రమంలో టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, జగ్గారెడ్డి కుమారుడు భరత్ సాయి రెడ్డి పాల్గొన్నారు. సంగారెడ్డి పాత బస్టాండ్ రామ్ నగర్ లో జగ్గారెడ్డి ఇంటి వద్ద బాలల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం లో బాలలు సంతోషంగా పాల్గొన్నారు. పండిట్ నెహ్రూ, ఇందిరా గాంధి, రాజీవ్ గాంధీ ల జీవిత చరిత్ర ను తెలిపేలా ప్రత్యేక డాన్స్, స్కిట్ లతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. భారత దేశ అభివృద్ధి కి ప్రధాన మంత్రి గా నెహ్రూ తీసుకున్న నిర్ణయాలు, భారీ ప్రాజెక్టు ల రూపకల్పన, ఐఐటి, ఐఐఎం ల ఏర్పాటు వంటి అంశాలను కళ్ళకు కట్టినట్టు కళాకారులు ఈ కార్యక్రమంలో చూపించారు.
Thursday, November 13, 2025
బీసీల ధర్మపోరాట దీక్షను విజయవంతం చేయండి -నాయకోటి రాజు
సంగారెడ్డి, నవంబర్ 13 (ఎస్ ఎన్ ఎం న్యూస్): రిజర్వేషన్లు ఎవరిచ్చే భిక్ష కాదు ... ఇది మా హక్కు బిసిలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో 42శాతం రిజర్వేషన్లు పెంచడానికి పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేసీ, తొమ్మిదవ షెడ్యూల్ చేర్చాలనే ప్రధాన డిమాండ్ తో13, 2025 నవంబర్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాలలో...బిసీల ధర్మ పోరాట దీక్షలు విజయవంతం చేయాలని బిసి జాయింట్ యాక్షన్ కమిటీ (బిసి జెఎసి), తెలంగాణ రాష్ట్రం వారు ఒక ప్రకటనలో తెలియజేశారు.
అభిమానానికి ప్రతిగా అండగా నిలిచిన జగ్గారెడ్డి చెప్పులు కుట్టే కార్మికుడికి రూ.50 వేల ఆర్థిక సహాయం
సంగారెడ్డి, ఫిబ్రవరి 10 (SNM NEWS): సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. మానవతా విలువలకు ప్రతీకగా నిల...
-
సంగారెడ్డి, డిసెంబర్ 21 (SNM NEWS): వికారాబాద్ జిల్లా కోటిపల్లి సర్పంచ్ సంగయ్య స్వామిపై జరిగిన దాడికి సంగారెడ్డిలో ఆదివారంనాడు జంగమ అర్చక ప...
-
సంగారెడ్డి, డిసెంబర్ 18 (SNM NEWS): పటాన్చేరు ప్రాంత ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం జీవితాంతం పోరాడిన పర్యావరణ యోధుడు దివంగత డా. అ...
-
సంగారెడ్డి అక్టోబర్ 22 (ఎస్ఎన్ఎం న్యూస్): సంగారెడ్డి నుంచి తిరుపతి కాణిపాకం అరుణాచలం మీదుగా శబరిమల వరకు మహా పాదయాత్ర వెళ్లిన సాహితీ రాము...












