Friday, October 03, 2025

సంగారెడ్డి రూరల్ ఎస్‌ఐ రవీందర్‌ సస్పెన్షన్

 


సంగారెడ్డి ప్రతినిధి, అక్టోబర్ 3 (SNM NEWS):  

సంగారెడ్డి రూరల్ పోలీసు స్టేషన్ కు సంభందించిన జోగిపేటకు చెందిన యూట్యూబర్ కేసులో రవీందర్ ఎస్ఐ ఒక వ్యక్తి నుండి డబ్బులను అడిగినందుకు గాను, సంబంధిత వ్యక్తి డబ్బులు ఇవ్వలేనని, మన:స్థాపానికి లోనై నదిలోకి దూకి అదృశ్యమయ్యాడు. అందుకు సంబంధించి మిస్సింగ్ అయిన వ్యక్తి  యొక్క భార్య జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో, ఎస్పీ  సంగారెడ్డి డీఎస్పీ ద్వారా ప్రాథమిక విచారణ జరిపించి, నివేదిక ఆధారంగా ఉన్నతాధికారులకు రూరల్ ఎస్ఐ పై క్రమశిక్షణ చర్యలకు సిఫార్సు చేసి,  మల్టీ జోన్-2 ఐజీ ఆదేశాల మేరకు సంగారెడ్డి రూరల్ ఎస్ఐ రవీందర్ ను విధుల నుండి సస్పెండ్ చేసినట్లు తెలిపారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అవినీతి ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని, ఏ స్థాయి లో ఉన్న వారైన శాఖపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.

No comments:

Post a Comment

అభిమానానికి ప్రతిగా అండగా నిలిచిన జగ్గారెడ్డి చెప్పులు కుట్టే కార్మికుడికి రూ.50 వేల ఆర్థిక సహాయం

  సంగారెడ్డి, ఫిబ్రవరి 10 (SNM NEWS): సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. మానవతా విలువలకు ప్రతీకగా నిల...