సంగారెడ్డి ప్రతినిధి సెప్టెంబర్ 19 (SNM న్యూస్): శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు ఆధునిక వైద్య సేవలను అందిస్తున్న జియాన్ చెస్ట్ కేర్ రెండో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. డాక్టర్ కె.సువర్ణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వైద్య కేంద్రం ద్వారా ఆస్తమా, అలర్జీ, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధి (సీఓపీడీ), నిద్ర సంబంధిత సమస్యలు, న్యూమోనియా, ఊపిరితిత్తుల వ్యాధులు, దీర్ఘకాలిక దగ్గు, క్షయ, ఊపిరితిత్తుల క్యాన్సర్, బ్రాంకైటిస్, ప్లూరల్ ఎఫ్యూషన్ తదితర వ్యాధులకు వైద్య సేవలు అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అలాగే ధూమపానం మాన్పించేందుకు ప్రత్యేక సలహాలు, ఊపిరితిత్తుల పునరావాసం, వయోజనులకు ఫ్లూ, న్యూమోకాకల్ టీకాలు వంటి సేవలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్రంలో నిద్ర పరీక్ష, కఫ పరీక్షలు, పీఎఫ్‌టీ, ఈసీజీ, ఎఫ్‌ఎన్‌ఏసీ, బ్రాంకోస్కోపీ తదితర పరీక్షలతో పాటు ప్రయోగశాల, ఔషధ కేంద్రం సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రెండేళ్లుగా ప్రజలకు నాణ్యమైన శ్వాసకోశ వైద్య సేవలను అందిస్తూ ముందుకు సాగుతున్న జియాన్ చెస్ట్ కేర్ భవిష్యత్తులోనూ మరింత విస్తృతమైన సేవలను అందించేందుకు కృషి చేస్తుందని నిర్వాహకులు తెలిపారు. రెండో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వైద్యులు, సిబ్బంది, శుభాకాంక్షలు తెలిపిన రోగులు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రాంతీయ నుంచి జాతీయ స్థాయి వరకు తాజా రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, సమాజం, విద్య, ఉద్యోగాలు, క్రీడలు, ప్రత్యేక కథనాలను నిష్పక్షపాతంగా అందించే విశ్వసనీయ తెలుగు న్యూస్ బ్లాగ్. నిజమైన వార్తలతో ప్రజల గళంగా నిలుస్తుంది.
Sunday, September 20, 2026
శ్వాసకోశ వ్యాధులకు సమగ్ర వైద్య సేవలు -ఘనంగా జియాన్ చెస్ట్ కేర్ రెండో వార్షికోత్సవం
Subscribe to:
Post Comments (Atom)
గాంధీ విగ్రహానికి జర్నలిస్టుల సమస్యలపై వినతి..!
-ఇంటి స్థలాలు, హెల్త్ కార్డులు, అక్రిడిటేషన్లు మంజూరు చేయాలని జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి డిమాండ్ సంగారెడ్డి అక్టోబర్ 2 (SN...
-
పటాన్చెరు, ఆగస్టు 27 (SNM న్యూస్): కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో రాఖీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సోదర–స...
-
సంగారెడ్డి, డిసెంబర్ 21 (SNM NEWS): వికారాబాద్ జిల్లా కోటిపల్లి సర్పంచ్ సంగయ్య స్వామిపై జరిగిన దాడికి సంగారెడ్డిలో ఆదివారంనాడు జంగమ అర్చక ప...
-
సంగారెడ్డి, డిసెంబర్ 18 (SNM NEWS): పటాన్చేరు ప్రాంత ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం జీవితాంతం పోరాడిన పర్యావరణ యోధుడు దివంగత డా. అ...
No comments:
Post a Comment