సంగారెడ్డి, జూన్ 20: సంగారెడ్డి పట్టణంలోని గొల్లగూడం గణేష్ నగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన చాయ్ బంక్ కేఫ్ను సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేఫ్ నిర్వాహకులు సాయికృష్ణ, దశరథ్, అశోక్, ప్రశాంత్, శేఖర్‌లతో కలిసి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, స్థానిక ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తూ వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు. యువత స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేఫ్ నిర్వాహకులు మాట్లాడుతూ, వినియోగదారులకు పరిశుభ్రమైన వాతావరణంలో అత్యుత్తమ నాణ్యతతో చాయ్, కాఫీతో పాటు ఇతర పానీయాలను అందుబాటు ధరల్లో అందిస్తామని తెలిపారు. వినియోగదారుల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా సేవలు అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, కాలనీవాసులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment