Sunday, June 14, 2026

ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత బలమైన ఆయుధం: నిర్మల జగ్గారెడ్డి

 


ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై కాంగ్రెస్ బీఎల్‌ఏలకు అవగాహన సదస్సు

నారాయణఖేడ్, జూన్ 14: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అత్యంత బలమైన ఆయుధమని, ప్రతి అర్హుడి ఓటు హక్కు పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని టీజీఐఐసీ చైర్‌పర్సన్, జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నారాయణఖేడ్‌లో టీపీసీసీ ఆధ్వర్యంలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టనున్న ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంపై కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్ల (బీఎల్‌ఏలు)కు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, బీఎల్‌ఏలు చిత్తశుద్ధితో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఓటు హక్కు పరిరక్షణకు ప్రతి కార్యకర్త బాధ్యతాయుతంగా వ్యవహరించడంతో పాటు ప్రజల్లో కూడా విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.కార్యక్రమంలో పాల్గొన్న జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ, ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై బీఎల్‌ఏలు పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించుకోవాలని అన్నారు. ప్రజలకు సరైన సమాచారం అందించి తప్పులు లేని ఓటరు జాబితా రూపొందేందుకు కృషి చేయాలని, అర్హులైన ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, ట్రైనర్ రాజీవ్, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీమ్, టీపీసీసీ సభ్యుడు శ్రీనివాస్, డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీఎల్‌ఏలు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

ఏవీఎన్‌ఎల్–ఓఎఫ్‌ఎంకేలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

  ఎద్దుమైలారం, జూన్ 21: ఎద్దుమైలారంలోని ఏవీఎన్‌ఎల్–ఓఎఫ్‌ఎంకే ఎస్టేట్ పరిధిలోని శరత్ యోగా కేంద్రంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా న...