సంగారెడ్డి, మార్చి 30 (SNM న్యూస్); సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రముఖ జ్యువెలరీ సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నూతన షోరూమ్ ఘనంగా ప్రారంభమైంది. ప్రపంచంలోనే ఆరవ అతిపెద్ద జ్యువెలరీ సంస్థగా గుర్తింపు పొందిన ఈ సంస్థ తన విస్తరణలో భాగంగా సంగారెడ్డిలో 27వ నూతన స్టోర్ ను సోమవారం ఘనంగా ప్రారంభించింది. ఈ షోరూమ్‌ను సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికి, శాలువాతో సన్మానించారు. సంగారెడ్డిలో ఈ షోరూమ్‌ను ఏర్పాటు చేయడంపై ఎమ్మెల్యే చింత ప్రభాకర్ యజమాన్యాన్ని అభినందిస్తూ, ప్రాంతీయ అభివృద్ధికి ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, స్థానిక కౌన్సిలర్ నక్క మంజులత నాగరాజు గౌడ్, కౌన్సిలర్లు కొత్తపల్లి నాని, జలంధర్, జాఫర్, దశరథ్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ కొండల్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు చక్రపాణి, నక్క నాగరాజ్ గౌడ్, లాడేబాలు తదితరులు పాల్గొన్నారు.
SNM NEWS MEDIA
ప్రాంతీయ నుంచి జాతీయ స్థాయి వరకు తాజా రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, సమాజం, విద్య, ఉద్యోగాలు, క్రీడలు, ప్రత్యేక కథనాలను నిష్పక్షపాతంగా అందించే విశ్వసనీయ తెలుగు న్యూస్ బ్లాగ్. నిజమైన వార్తలతో ప్రజల గళంగా నిలుస్తుంది.
Tuesday, March 31, 2026
సంగారెడ్డిలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నూతన షోరూమ్ ప్రారంభం
Thursday, March 19, 2026
నవోదయ ఫలితాల్లో వివేకానంద కోచింగ్ సెంటర్ ప్రభంజనం
సంగారెడ్డి, మార్చి 19(SNM న్యూస్):నవోదయ 2026 ఫలితాల్లో వివేకానంద కోచింగ్ సెంటర్ విద్యార్థి ఎం.శరత్ చంద్ర 95.25 మార్కులతో జిల్లాలోనే మొదటి ర్యాంకు సాధించారని సంస్థ కరస్పాండెంట్ అరిగే వీణ శ్రీనివాస్ తెలియజేశారు. సంస్థ నుండి మరో విద్యార్థి 88.75 మార్కులతో నవోదయాలో సీటు సాధించారని తెలియజేశారు. సంస్థ స్థాపించిన నాటి నుండి ప్రతి సంవత్సరం వివేకానంద కోచింగ్ సెంటర్ ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నట్లు యాజమాన్యం ఈ సందర్భంగా విద్యార్థులకు తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేస్తూ మీరు భవిష్యత్తులో మంచి అత్యుత్తమ ఫలితాలతో అగ్రగామిగా రాణించాలని కరస్పాండెంట్ తెలియజేశారు. ఈ విజయానికి సహకరించిన అధ్యాపక బృందానికి, విద్యార్థుల తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేశారు.
Wednesday, March 18, 2026
రితిన్స్ అకాడమీ కోచింగ్ సెంటర్ నవోదయ రిజల్ట్స్ లో ప్రభంజనం... ప్రభంజనం...ప్రభంజనం...
శరత్ చంద్ర విద్యార్థికి శుభాకాంక్షలు తెలియజేసిన డైరెక్టర్ & మోటివేషన్ స్పీకర్ ప్రకాష్
సంగారెడ్డి ప్రతినిధి, మార్చి 17 (SNM న్యూస్): నియోజకవర్గంలో రితిన్స్ అకాడమీ కోచింగ్ సెంటర్ మరియు స్టడీ హాల్ లో కొన్ని సంవత్సరాల నుండి వరుసగా అన్ని రిజల్ట్స్ లో ప్రభంజనం సృష్టిస్తుంది ఈ రోజు విడుదల చేసిన జవహర్ నవోదయ రిజల్ట్స్ లో కూడా శరత్ చంద్ర అనే విద్యార్థికి ఓవర్ఆల్ నెంబర్ వన్ ర్యాంక్ సాధించి ప్రభంజనం సృష్టించాడు రితిన్స్ అకాడమీ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ మరియు మోటివేషన్ స్పీకర్ ప్రకాష్ , విద్యార్థి శరత్ చంద్ర కు శుభాకాంక్షలు తెలియచేశారు.మరియు వారి తల్లితండ్రులు ఎంతో ఆనందం వ్యక్త పరిచారు.కాబట్టి నవోదయ కోచింగ్ కోసం మా రితిన్స్ అకాడమీ కోచింగ్ సెంటర్ కి వచ్చి రిజల్ట్స్ ప్రభంజనం సృష్టించగలరని డైరెక్టర్ & మోటివేషన్ స్పీకర్ తెలియచేశారు.
సంగారెడ్డిలో ఘనంగా బేటీ జన్మోత్సవ కార్యక్రమం
సంగారెడ్డి ప్రతినిధి, మార్చి 17 (SNM న్యూస్): సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా–శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో, మహిళా సాధికారత కేంద్రం సహకారంతో బేటీ జన్మోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఆసుపత్రిలో జన్మించిన ఆడ శిశువులను గౌరవిస్తూ బేటీ జన్మోత్సవ కిట్లు, ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా మహిళా సంక్షేమాధికారి, జిల్లా వైద్య ఆరోగ్యాధికారి మాట్లాడుతూ ఆడపిల్లలు, మగపిల్లలను సమానంగా చూడాల్సిన అవసరాన్ని వివరించారు. సమాజంలో ఆడపిల్లల పట్ల గౌరవ భావం పెంపొందించాల్సిన అవసరాన్ని తెలియజేశారు. బాలికల విద్య, ఆరోగ్యం, భద్రత అంశాలలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని సూచించారు. అలాగే, పుట్టిన శిశువులకు తల్లి పాల ప్రాధాన్యతను వివరిస్తూ మొదటి ఆరు నెలల పాటు పూర్తిగా తల్లి పాలనే ఇవ్వాలని అవగాహన కల్పించారు. అవసరమైన సందర్భాలలో మహిళా సాధికారత కేంద్రం సేవలను వినియోగించుకోవాలని సూచించారు. బాలికల హక్కుల పరిరక్షణ, పోషణ, విద్యపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటేనే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అధికారి డాక్టర్ మురళీకృష్ణ, డాక్టర్ నాగనిర్మల, మహిళా సాధికారత కేంద్ర సమన్వయకర్త పల్లవి, ఆసుపత్రి సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతంగా సాగింది. ఇదే విధంగా పటాన్‌చెరు ప్రాంతీయ ఆసుపత్రిలో కూడా బేటీ జన్మోత్సవ కిట్లను పంపిణీ చేశారు.
తల్లి కిడ్నీ దానం– కొడుకుకు కొత్త జీవితం
సంగారెడ్డి ప్రతినిధి, మార్చి 17 (SNM న్యూస్):: తల్లి ప్రేమకు మరో ఉదాహరణగా నిలిచే ఘటన సంగారెడ్డిలో చోటుచేసుకుంది. తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఓ తల్లి తన కుమారుడికి కిడ్నీ దానం చేసి కొత్త జీవితం ప్రసాదించింది. సంగారెడ్డికి చెందిన సందీప్ గత కొన్ని సంవత్సరాలుగా కిడ్నీ వ్యాధితో తీవ్రంగా బాధపడుతున్నాడు. పలుమార్లు డయాలసిస్ చేయించుకున్నప్పటికీ ఆరోగ్యం మెరుగుపడలేదు. ఈ క్రమంలో చికిత్స కోసం కుటుంబం ఆర్థికంగా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. తన కుమారుడి ప్రాణాలను కాపాడేందుకు తల్లి ముందుకు వచ్చి స్వచ్ఛందంగా తన కిడ్నీని దానం చేసింది. అనంతరం హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్‌లో వైద్యులు డాక్టర్ మురళీ నాథ్ నేతృత్వంలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. శస్త్రచికిత్స అనంతరం తల్లి, కుమారుడు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా సంగారెడ్డిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆసుపత్రి వైద్యులు, కిడ్నీ దానం చేసిన తల్లి వివరాలను వెల్లడించారు. తల్లి ప్రేమకు ఇది నిదర్శనమని, అవయవ దానం పట్ల ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచించారు.
Sunday, March 15, 2026
ఇసోజిపేటలో సిసి రోడ్డు పనుల ప్రారంభం
సంగారెడ్డి ప్రతినిధి మార్చి 15 (SNM న్యూస్): పుల్కల్ మండలంలోని ఇసోజీపేట గ్రామంలో 20 లక్షల సిసి రోడ్డు ప్రారంభిస్తున్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుర్గారెడ్డి, గ్రామ సర్పంచి విజేందర్ రెడ్డి, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వైద ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాల మేరకు గ్రామ అభివృద్ధి గురించి సిసి రోడ్లు వేయడం జరుగుతుందని అన్నారు, ఈ గ్రామానికి ప్రజలకు సేవ చేసే అదృష్టం నాకు కలిగిందని సర్పంచ్ విజేందర్ రెడ్డి అన్నారు, ఈ కార్యక్రమంలో మండలం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామచంద్రారెడ్డి, నాయకుని గోవర్ధన్ సత్తార్ పటేల్ గోపాల్ తాజా మాజీ ఎంపిటిసి నాయకుని రవికుమార్ గ్రామ ఉపసర్పంచి రవికుమార్ వార్డు సభ్యులు బి నరేంద్ర,నాయకులు శివనుల గణపతి తలారి యాదగిరి సుఖేందర్ రెడ్డి లచిరెడ్డి లక్మన్ రెడ్డి మంగలి రాజు పండరి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
Saturday, March 07, 2026
నేడు జహీరాబాద్‌లో మహిళలకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్,ఆరోగ్య శిబిరం
సంగారెడ్డి ప్రతినిధి, మార్చి 7 (SNM న్యూస్):అం తర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నేడు అనగా మార్చి 8 ఆదివారం రోజున జహీరాబాద్‌లో మహిళల కోసం భారీ ఉచిత ఆరోగ్య, క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని నిర్వహించనున్నట్లు ఫ్యూయెలింగ్ గ్రోత్ ఫౌండేషన్ ఫౌండర్, ట్రస్టి పైలెట్ బాబి అజ్మీరా ఒక ప్రకటనలో తెలిపారు. స్టార్ హాస్పిటల్స్ సహకారంతో నిర్వహిస్తున్న ఈ శిబిరం జహీరాబాద్‌లోని పాస్తాపూర్ రోడ్డులో గల డాక్టర్ ఆర్ ఎల్ ఆర్ స్కూల్, జూనియర్ కాలేజీలో ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు కొనసాగుతుంది. శిబిరం ప్రత్యేకతలు, ముందస్తు గుర్తింపు: రొమ్ము, గర్భాశయ, క్యాన్సర్లను ప్రాథమిక దశలోనే గుర్తించడం ద్వారా ప్రాణాపాయం నుండి తప్పించుకోవచ్చు. ఉచిత సేవల వివరాలు అనుభవజ్ఞులైన స్టార్ హాస్పిటల్ వైద్యులచే ఉచిత సంప్రదింపులు, వెల్నెస్ స్క్రీనింగ్ నిర్వహించబడును. ఎవరు హాజరుకావచ్చు: 40 నుండి 65 ఏళ్ల లోపు వయస్సు గల మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్క్రీనింగ్ చేయించుకోవాలనుకునే వారు తమ పాత మెడికల్ రిపోర్టులు (ఉంటే) వెంట తీసుకురావాలి. శిబిరంలో ముందుగా వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఇతర వివరాల కోసం మరియు ముందస్తు రిజిస్ట్రేషన్ కోసం 94900 59175 నంబర్‌ను సంప్రదించగలరు. మహిళలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి, ఈ ఉచిత శిబిరాన్ని జయప్రదం చేయాలని ఫ్యూయెలింగ్ గ్రోత్ ఫౌండేషన్, స్టార్ హాస్పిటల్స్ బృందం కోరారు.
సంగారెడ్డిలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నూతన షోరూమ్ ప్రారంభం
సంగారెడ్డి, మార్చి 30 (SNM న్యూస్); సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రముఖ జ్యువెలరీ సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నూతన షోరూమ్ ఘనంగా ప్రారంభ...
-
సంగారెడ్డి, డిసెంబర్ 21 (SNM NEWS): వికారాబాద్ జిల్లా కోటిపల్లి సర్పంచ్ సంగయ్య స్వామిపై జరిగిన దాడికి సంగారెడ్డిలో ఆదివారంనాడు జంగమ అర్చక ప...
-
సంగారెడ్డి, డిసెంబర్ 18 (SNM NEWS): పటాన్చేరు ప్రాంత ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం జీవితాంతం పోరాడిన పర్యావరణ యోధుడు దివంగత డా. అ...
-
సంగారెడ్డి అక్టోబర్ 22 (ఎస్ఎన్ఎం న్యూస్): సంగారెడ్డి నుంచి తిరుపతి కాణిపాకం అరుణాచలం మీదుగా శబరిమల వరకు మహా పాదయాత్ర వెళ్లిన సాహితీ రాము...





