Sunday, August 31, 2025

సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా నెల రోజుల పాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు

 

సంగారెడ్డి ప్రతినిధి, ఆగష్టు 31 (SNM NEWS): శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని నెల రోజుల పాటు అనగా సెప్టెంబర్ 1వ తేది నుండి 30  వరకు సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్-1861 అమలులో ఉంటుందని కావున సంగారెడ్డి జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీసుల ముందస్తు అనుమతి లేనిది ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్స్, సభలు, సమావేశాలు నిర్వహించరాదని, శాంతి భద్రతలకు భంగం కలిగే విధంగా, ప్రజాధనానికి నష్టం కల్గించే, ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టకూడదన్నారు. జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు ఇట్టి విషయంలో పోలీసు వారికి సహకరించాలని, అనుమతి లేకుండా పై చర్యలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై చట్టరిత్య కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా యస్.పి.పరితోష్ పంకజ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. 

అయ్యప్ప కాలనీలో గణ నాధునికి ప్రత్యేక పూజలు

సంగారెడ్డి 30వార్డు అయ్యప్ప కాలనీలో కృష్ణ చైతన్య యూత్ వారి వినాయక మండపంలో గొల్ల ఆంజనేయులు ఆధ్వర్యంలో చింత సాయినాథ్ టౌన్ సీఐ రమేష్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంగారెడ్డి పట్టణం  30వార్డులో కృష్ణ చైతన్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణ నాధుని వద్ద బి ఆర్ ఎస్  నాయకులు గొల్ల ఆంజనేయులు ఆధ్వర్యంలో భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో  బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు చింత సాయినాథ్, టౌన్ సీఐ రమేష్ పాల్గొని వినాయకునికి ప్రత్యేక పూజలు జరిపారు.. అనంతరం వారిని ఘనంగా సన్మానించిన గొల్ల ఆంజనేయులు.. ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు అనంతయ్య, అరుణ్ చారీ, అఖిల్, తూరుపు ఆంజనేయులు, కృష్ణ, రాజు, నవీన్, మహేందర్ మరియు కృష్ణ చైతన్య యూత్ అసోసియేషన్ సభ్యులు సాయి కిరణ్ వంశీ కోట కార్తీక్ విజయ్ వైద్యనాథ్ శ్రీపాద్ జాషన్ బాలాజీ మరియు స్థానిక 30వార్డు కాలనీ వాసులు మహిళలు యువకులు పాల్గొన్నారు.

పదవి విరమణ కార్యక్రమం

సంగారెడ్డి నాలుగో తరగతి సిబ్బంది పదవి విరమణ అయినందున వారి యొక్క సన్మానం గురించి పదవి విరమణ కార్యక్రమం సందర్భంగా మన తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం భవనంలో ఏర్పాటుచేసిన పదవి విరమణ సన్మాన కార్యక్రమం జరుపుకుంటున్న  అందులో  దుర్గయ్య ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్, కే సత్యనారాయణ చీఫ్ ప్లానింగ్ ఆఫీస్  ఆనంద్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈ సభ్యులు పదవి విరమణ అందుకున్నారు ఈ కార్యక్రమంలో నాలుగో తరగతి జిల్లా అధ్యక్షుడు షరీఫ్, సెక్రెటరీ నాగరాజు, అసోసియేషన్ ప్రెసిడెంట్ పి అశోక్, మరియు టౌన్ అధ్యక్షుడు పండరి ట్రెజరర్ ప్రవీణ్ కుమార్, పాల్గొన్నారు.

Saturday, August 30, 2025

విద్యార్థిని షూలో ప్రత్యక్షమైన పాము సంఘటన

 


సంగారెడ్డి ప్రతినిధి, ఆగష్టు 30 (SNM NEWS):
సంగారెడ్డి జిల్లాలో ఓ విద్యార్థిని షూలో పాము ప్రత్యక్షమైన సంఘటన చోటుచేసుకుంది. మెదక్  జిల్లాకు చెందిన ఓ యువతి సంగారెడ్డిలోని  బీఎస్సీ నర్సింగ్ కళాశాలలో చదువుతోంది. ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం కళాశాలకు వెళ్లేందుకు హాస్టల్ వద్ద ఆ విద్యార్థిని షూ వేసుకుంటుండగా అందులో పాము కనిపించింది. దాంతో ఆమె ఒక్కసారిగా భయాందోళనకు గురై షూ ను దూరంగా విసిరేసింది. పాము షూ నుంచి బయటకు రాగా కర్రతో కొట్టి చంపారు. పాము షూ లోకి రావడంతో హాస్టల్ లో ఉన్న విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. నర్సింగ్ కళాశాల హాస్టల్ కు పక్కా భవనం లేకపోవడంతో మహిళా ప్రాంగణంలో కొనసాగిస్తున్నారు. అయితే హాస్టల్ లోకి తరచుగా పాములు వస్తున్నాయని విద్యార్థినులు చెబుతున్నారు.

కొండాపూర్, సదాశివపేట పోలీసు స్టేషన్లను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

 



సంగారెడ్డి ప్రతినిధి, ఆగష్టు 30 (SNM NEWS):

కొండాపూర్, సదాశివపేట పోలీసు స్టేషన్లను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఈ సందర్భంగా పోలీసు స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, రికార్డుల మెయింటెనెన్స్ ను పరిశీలించారు. అనంతరం అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులు, స్టేషన్ రికార్డ్లను తనిఖీ చేస్తూ..,  లాంగ్ పెండింగ్ కేసులలో ఇన్వెస్టిగేషన్ ను త్వరితగతిన పూర్తి చేయాలని, ఇన్వెస్టిగేషన్ లో ఎలాంటి సందేహాలున్న ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని ఎస్.హెచ్.ఓ కు సూచించారు. పోలీసు స్టేషన్ కు వచ్చిన వారితో మర్యాదగా మాట్లాడాలని వారిసమస్యను ఓపికగా విని సత్వర న్యాయానికి కృషి చేయాలని ఎస్.హెచ్.ఓ లకు సూచించడం జరిగింది. సమస్యలతో స్టేషన్ కు వచ్చిన ఫిర్యాదిదారులతో మాట్లాడుతూ.. వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. బ్ల్యూ కొల్ట్స్, పెట్రోకార్ సిబ్బంది తమకు కేటాయించిన ఏరియాలో గస్తీకాస్తూ, అనుమానిత వ్యక్తుల నుండి పాపిలోన్ డివైస్ ను వినియోగించి, ఫింగర్ ప్రింట్స్ సేకరించాలని, రౌడీ, కేడీ, సస్పెక్ట్ లను చెక్ చేయాలన్నారు. సిబ్బంది తమకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వర్తిస్తూ ఆయా వర్టికల్ విభాగాలలో ఉత్తమ ప్రతిభ చూపి జిల్లాను ముందు వరుసలో నిలపడానికి కృషి చేయాలని అన్నారు.

భారీ వర్షాల దృష్ట్యా అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, తమ ఏరియాలో గల చెరువులు, కుంటల ఆనకట్టలు ప్రమాదఅంచున ఉన్నట్లయితే ప్రమాద సూచిక బోర్డు లను ఏర్పాటు చేయాలని అన్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు, ఈద్ మిలాడ్ ఉన్ నబీ పండగలు ఏకకాలంలో వస్తుండటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన బందోబస్తు ఏర్పాట్లను చేసుకోవాలని ఎస్. హెచ్. ఓ లకు సూచనలు చేశారు. మన చుట్టూ జరుగుతున్న ఆన్లైన్ మోసాలు, బెట్టింగ్స్, బెట్టింగ్ యాప్స్, రోడ్డు ప్రమాదాల గురించి కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా జిల్లా ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, నేరాల నివారణకు, జరిగిన నేరాలను చేధించడానికి కీలకంగా ఉపయోగపడే సిసి కెమెరాల ప్రాధాన్యతను ప్రజలకు వివరిస్తూ సిసి కెమెరాల ఏర్పాటు చేసుకునే విధంగా చూడాలన్నారు. ఈ సందర్శనలో సదాశివపేట ఇన్స్పెక్టర్ డి.వెంకటేశ్, కొండాపూర్ ఇన్స్పెక్టర్ సుమన్, ఎస్ఐ సోమేశ్వరి ఉన్నారు.

పోలీస్ శాఖలో ఫిజికల్ ఫిట్నెస్ చాలా కీలకం

 -విపత్కర పరిస్థితులలో తక్షణం స్పందించేందుకు ఫిట్ గా ఉండాలి

-క్రమశిక్షణతో విధులు నిర్వహించాలి  

-జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలి

-ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వీక్లీ పెరేడ్

-జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్



సంగారెడ్డి ప్రతినిధి, ఆగష్టు 30 (ఎస్ఎన్ఎం న్యూస్):

జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్స్ నందు జిల్లా ఆర్మూడ్ రిజర్వ్ పోలీసు సిబ్బందికి ఆర్.ఐ రామారావ్ ఆద్వర్యంలో వీక్లీ పరేడ్ నిర్వహించడం జరిగింది.  ఈ సందర్భంగా ఎస్పీ ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో ఫిజికల్ ఫిట్నెస్ చాలా కీలకం అని, శారీరకంగా, మానసికంగా ఫిట్నెస్ తో ఉన్నప్పుడే ఎలాంటి పరిస్థితులలోనైనా విధులను సమర్ధవంతంగా నిర్వర్తించగలమని, ఫిట్నెస్ ను కాపాడుకోవడానికి ప్రతి రోజు వ్యాయామం, యోగా వంటివి సాధన చేయాలని అధికారులకు, సిబ్బందికి  సూచించారు. భారీ వర్షాల దృష్ట్యా జిల్లా పోలీసు యంత్రాంగా అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పరిస్తుతులలోనైనా స్పందించడానికి సిద్దంగా ఉండాలని అన్నారు. రానున్న వినాయక నిమర్జనం, ఈద్ మిలాడ్ ఉన్ నబీ పండగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకునే విధంగా తగిన బందోబస్తు నిర్వహించాలని సూచించడం జరిగింది. ఈ వీక్లీ పెరేడ్ నందు ఆర్.ఐ.లు రామారావ్, రాజశేఖర్ రెడ్డి, డానియెల్, ప్లటూన్ ఇంచార్జ్ లు, సిబ్బంది తదితరులు ఉన్నారు.

అభిమానానికి ప్రతిగా అండగా నిలిచిన జగ్గారెడ్డి చెప్పులు కుట్టే కార్మికుడికి రూ.50 వేల ఆర్థిక సహాయం

  సంగారెడ్డి, ఫిబ్రవరి 10 (SNM NEWS): సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. మానవతా విలువలకు ప్రతీకగా నిల...